ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > అంతర్జాతీయ
 
పాక్‌లో బాంబు పేలుడు : 25 మంది మృతి
ఇస్లమాబాద్‌లో శనివారం పాకిస్థాన్ సైనిక హెడ్‌క్వార్టర్స్‌కు సమీపంలో ఆత్మాహుతి దాడి చేయడంతో భారీ విస్ఫోటనం సంభవించింది. ఈ పేలుడులో ఇప్పటి వరకు 25 మంది మృతి చెందినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

ఈ బాంబు పేలుడు ఇస్లామాబాద్‌లోని రావిల్పిండిలో ఉన్న సైనిక హెడ్‌క్వార్టర్స్ సమీపంలో రద్దీగా ఉన్న ప్రాంతంలో సంభవించిందని పేర్కొన్నాయి. ఆర్మీ మేజర్ జనరల్ వషీద్ అర్షద్ మాట్లాడుతూ ఈ బాంబు పేలుడు సంఘటనలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆయన అన్నారు.
మరిన్ని
వచ్చే వారంలో ముష్ ప్రమాణ స్వీకారం: ఖయ్యూమ్
ఎన్నికలకు ముందుగానే షరీఫ్ స్వదేశీ ఆగమనం
కామన్వెల్త్ నుంచి పాక్‌ బహిష్కరణ..!
ఒప్పందానికి ముందు కీలకాంశాల పరిష్కారం: కకోద్కర్
ముషారఫ్‌పై దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసిన కోర్టు
అణు ఇంధన సరఫరా: భారత్‌కు చైనా మద్దతు