పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఎట్టకేలకు సొంత గడ్డపై కాలు మోపారు. తన సోదరుడు షాహబ్జ్ షరీఫ్, ఇతర కుటుంబ సభ్యులతో ఆదివారం సౌదీ నుంచి లాహోర్‌కు ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. లాహోర్ విమానశ్రయంలో ఆయనకు పాకిస్తాన్ ముస్లీ లీగ్ (ఎన్) పార్టీకి చెందిన కార్యకర్తలు, పీఎంల్-ఎన్ నేతలతో పాటు.. ఇతర ప్రముఖులు స్వాగతం పలికారు. షరీఫ్ రాక సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు లాహోర్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేపట్టారు. స్వదేశానికి వచ్చిన షరీఫ్‌ను బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించేందుకు పాక్ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది.
గత 1999లో జనరల్ పర్వేజ్ ముషారఫ్ సైనిక తిరుగుబాటుతో దేశాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత షరీఫ్ దేశం విడిచి వెళ్లిపోయిన విషయం తెల్సిందే. దాదాపు ఎనిమిది సంవత్సరాల సౌదీ అరేబియాలో తలదాచుకున్న షరీఫ్.. గత సెప్టెంబరు నెలలో పాకిస్తాన్‌కు రాగా.. ముషారఫ్ తిరిగి వెనక్కి పంచిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఆదివారం మళ్లీ స్వదేశానికి వచ్చారు. షరీఫ్ రాకను ప్రస్తుతం పాకిస్తాన్ తాత్కాలిక ప్రభుత్వం ఆహ్వానించింది.
|