తమ విధ్వంసక కార్యకలాపాలతో ప్రపంచాన్నే వణికిస్తున్న 1500 మంది అల్ ఖైదా ఉగ్రవాదులను సౌదీ అరేబియా ప్రభుత్వం విడుదల చేసింది. మరికొందరిని విడిపించేందుకు ఆ దేశ ప్రభుత్వం ఉగ్రవాద నేతలతో శాంతి చర్చలు జరుపుతోంది. విడుదల చేసిన తీవ్రవాదులందరూ.. తమ చర్యలకు ప్రశ్చాత్తం వెలిబుచ్చుతూ జనజీవన స్రవంతిలోకి కలసి పోయేందుకు సమ్మతించారు. దీంతో వీరిని విడుదల చేసినట్టు సౌది ప్రభుత్వం సమర్థించుకుంది.
సౌదీ ద్వీపకల్పాన్ని బహుదేవతారాధన రుగ్మత నుంచి విముక్తి చేయాల్సిందిగా అల్ ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ గతంలో పిలుపునిచ్చాడు. దీంతో ఆ తీవ్రవాద సంస్థ ఉగ్రవాదులు 2003 నుంచి తమ వికృత చేష్టలతో మారణకాండ సృష్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో సౌదీ ప్రభుత్వం వారితో శాంతి చర్చలు జరిపింది. కొన్నివందల సార్లు వీరితో చర్చలు జరిపిన పిదప 1500 మందిని విడుదల చేసినట్టు ఆ ప్రభుత్వం ప్రకటించింది.
|