ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > అంతర్జాతీయ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
బెనజీర్ భుట్టోకు ఐర్లాండ్ "శాంతి బహుమతి"
ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం అశువులుబాసిన పాకిస్తాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో 'ఐర్లాండ్ శాంతి బహుమతి'కి ఎంపికయ్యారు. 2007 సంవత్సరానికి గాను ఆమెకు 'ఐర్లాండ్‌ టిప్పెరరీ శాంతి పురస్కారం' అందజేయనున్నారు. పాకిస్థాన్‌లో ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు చేసిన కృషికిగాను మరణానంతరం ఆమెను ఈ పురస్కారానికి ఎంపికైనట్టు శాంతి బహుమతి కమిటి ప్రకటించింది.

ఈ శాంతి బహుమతిని గత 1984 నుంచి టిప్పెరరీ పీస్‌ కన్వన్షెన్‌ సంస్థ అందజేస్తోంది. ఐర్లాండ్‌తో పాటు ఇతర దేశాల్లో శాంతి స్థాపనకు కృషి చేసిన దీన్ని బహుకరించడం ఆనవాయితి. గతంలో నెల్సన్‌ మండేలా, మిఖాయిల్‌ గోర్బచేవ్‌, బిల్‌క్లింటన్‌‌లకు ఈ అవార్డును అందజేశారు.

అయితే.. 2007కు గాను బెనజీర్ భుట్టోను ఎంపిక చేశామని, ఈ అవార్డును వచ్చే ఏప్రిల్ ఒకటో తేదీన టిప్పెరరీ పట్టణంలో జరిగే 'ఇంటర్నేషనల్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ పీస్‌' కార్యక్రమంలో బెనజీర్ కుటుంబ సభ్యలకు అందజేస్తామని పీస్‌ కన్వెన్షన్‌ ప్రతినిధి మార్టిన్‌ ఖ్విన్‌ తెలిపారు.
మరిన్ని
థాయ్‌లాండ్ రాణి కన్నుమూత
పాకిస్తాన్‌లో రూ.30 వేల కోట్ల ఆస్తి నష్టం
విద్యాభ్యాసం కోసం లండన్ వెళ్లిన బిలావల్
ఎన్నికల అధికారులతో నేపాల్ ప్రధాని
అణు జాబితాలను మార్చుకున్న ఇండో-పాక్
వాయిదాపడిన పాక్ ఎన్నికలు