ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > అంతర్జాతీయ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
రేపటి నుంచి ప్రణబ్ ముఖర్జీ విదేశీ పర్యటన
బ్రెజిల్, దక్షిణాఫ్రికా దేశాలలో కేంద్ర విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ వారం రోజుల పర్యటన శనివారం ప్రారంభం కానున్నది. రెండు దేశాలతో భారత్‌కు గల రాజకీయ, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసే దిశగా విదేశాంగ మంత్రి ఆయా దేశాల నేతలతో చర్చలు జరుపనున్నారు. అదేసమయంలో ఈ సంవత్సరంలో భారత్ ఆతిథ్యం వహించనున్న ఐబీఎస్ఏ సదస్సు ముఖ్యాంశాలు చర్చలో చోటు చేసుకునే అవకాశం ఉంది. ఫిబ్రవరి 16 నుంచి 18 మధ్యకాలంలో ప్రణబ్ ముఖర్జీ బ్రెజిల్‌లో పర్యటిస్తారు.

అలాగే ఫిబ్రవరి 21,22 తేదీలలో దక్షిణాఫ్రికాలో మంత్రి పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఏడవ సంయుక్త కమీషన్ సమావేశానికి ఆయన హాజరువుతారు. పర్యటన తొలి దశలో భాగంగా బ్రెజిల్ అధ్యక్షుడు లులా డా సైల్వా, ప్రధాన మంత్రి మరియు ఇతర నేతలతో భారత్‌లో జరుగనున్న మూడవ భారత్- బ్రెజిల్- దక్షిణాఫ్రికా సదస్సుపై ప్రణబ్ ముఖర్జీ చర్చలు సాగిస్తారు.
మరిన్ని
సుదూర లక్ష్య మిస్సైళ్లను అభివృద్ధి చేయం: ఇరాన్
న్యూ మెక్సికోలో క్లింటన్ విజయం
అణ్వాయుధ తయారీ సామర్థ్యం ఇరాన్‌ సొంతం: అమెరికా
సార్వత్రిక ఎన్నికలు దేశ చరిత్రకే కీలకం: ముషారఫ్
భుట్టోపై "లాల్ మసీదు" ప్రతీకార దాడి
మలేషియా పార్లమెంటును రద్దు చేసిన ప్రధాని