పశ్చిమ ఇండోనేసియా సముద్ర గర్భంలో బుధవారం పెను భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.6గా నమోదైన ఈ భూకంపం వల్ల సునామీ వచ్చే అవకాశం ఉందని అమెరికా భూగర్భ శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేశారు. భూకంపం చోటుచేసుకున్న సముద్రతీర ప్రాంతంలో నివాసముంటున్న 75 వేలమంది ప్రజలకు సమాచారాన్ని చేరవేయటం సాధ్యం కాలేదు.
భూకంపం ఏ మేరకు నష్టాన్ని కలిగించిందన్న వివరాలు వెంటనే తెలియరాలేదు. కాగా భూకంపం సంభవించిన కొద్దిసేపటికే పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం సుమత్రా తీరప్రాంతంలో నివాసముంటున్నవారు అప్రమత్తంగా ఉండాలని సమాచారాన్ని విడుదల చేసింది. అండమాన్, నికోబార్ దీవులకూ సునామీ ముప్పు ఉన్నట్లు జపాన్ భూగర్భ శాస్త్రవేత్తలు వెల్లడించారు.
|