తైవాన్ అధ్యక్ష పీఠానికి జరిగిన ఎన్నికల్లో కేఎంటీ విజయం సాధించింది. ఆ పార్టీకి చెందిన మా యింగ్ ఝౌ తైవాన్ కొత్త అధ్యక్షుడిగా విజయకేతనం ఎగురవేశారు. ప్రస్తుత అధ్యక్షుడు చెన్ షుయి-బియాన్‌కు చెందిన డెమొక్రటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి ఫ్రాంక్ షీ ఓటమి పాలయ్యారు. తైవాన్, చైనా మధ్య దశాబ్దాలుగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది.
ప్రస్తుతం అధ్యక్షుడు చెన్ షుయి వచ్చే మే నెల 20వ తేదీన తన అధ్యక్ష పదవి నుంచి తప్పుకోనున్నారు. మరోవైపు.. తైవాన్ ఐక్యరాజ్యసమితిలో చేరికకు ఆ దేశ ప్రజల మద్దతు లభించలేదు. 1971లో తైవాన్ ఐరాస సభ్యత్వాన్ని కోల్పోయింది. అప్పట్నుంచి సభ్యత్వం కోసం చేస్తున్న ప్రయత్నాలను చైనా అడ్డుకుంటోంది.
|