ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > అంతర్జాతీయ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
టిబెట్‌పై భారత్‌ వైఖరికి చైనా ప్రశంసలు
బీజింగ్‌తో సంబంధాలు దెబ్బతినేలా రాజకీయ కార్యకలాపాలకు పాల్పడరాదని దలైలైమాను కోరినందుకు గాను చైనా భారత్‌ను ప్రశంసించింది. వారం రోజులలోపే భారత్‌కు టిబెట్ పరిస్థితి గురించి రెండోసారి వివరించిన చైనా ఈ అంశంపై భారత్ మద్దతును తాము నిరవధికంగా కోరుతున్నట్లు సూచించింది.

భారత విదేశీ మంత్రి ప్రణబ్ ముఖర్జీతో ఫోన్ ద్వారా మాట్లాడిన చైనా విదేశీ మంత్రి యాంగ్ జియెచీ టిబెట్ సమస్యపై, ద్వైపాక్షిక సంబంధాలపై, న్యూఢిల్లీలో ఒలింపిక్ జ్యోతి రిలే కార్యక్రమంపై సుదీర్ఘంగా చర్చించారని చైనా విదేశాంగ శాఖ వ్యాఖ్యాత లియు జియాంచివో తెలిపారు.

టిబెట్‌లో ప్రస్తుత పరిస్థితిపై ముఖర్జీకి సంక్షిప్తంగా వివరించిన చైనా విదేశాంగ మంత్రి భారత్ సరైన వైఖరిని ప్రశంసిస్తూనే మరోవైపున టిబెట్‌ సమస్యపై భారత్ మద్దతు కొనసాగాలని తాము కోరుకుంటున్నామని తెలిపారు.

టిబెట్‌పై భారత్ వైఖరిని సరైందిగా చైనా వ్యాఖ్యాత తెలిపారు. ఇందుకు గాను భారత్‌కు మా ప్రశంసను అందజేస్తున్నామని లియూ చెప్పారు. భారత్-చైనా సంబంధాలను తీవ్రంగా దెబ్బతీసే ఎలాంటి రాజకీయ కార్యాచరణను, చర్యను దలైలామా భారత్‌లో చేపట్టరాదని ప్రణబ్ ముఖర్జీ కోరడంపై విలేఖరులు అడిగిన ప్రశ్నకు చైనా వ్యాఖ్యాత పైవిధంగా స్పందించారు.
మరిన్ని
పాక్ ఇంటెలిజెన్స్ ఛీఫ్‌పై వేటు
జింబాబ్వే ఎన్నికల్లో ప్రతిపక్షం గెలుపు
ఇరాక్‌లో హింస: 15 మంది హతం
భారత్ తోడ్పాటుపై అమెరికా భద్రత...
రాబర్ట్ ముగాబేకు ఎదురుగాలి
కాశ్మీర్ సమస్యకు పరిష్కారం