1. వార్తలు
  2. »
  3. తెలుగు వార్తలు
  4. »
  5. అంతర్జాతీయ వార్తలు

అమెరికా అధ్యక్ష పీఠం ఒబామాదే: సర్వేలు

అమెరికా అధ్యక్ష పీఠం ఎన్నికల్లో నల్ల జాతీయుడు బారక్ ఒబామాదే తుది విజయమని వివిధ సర్వేలు
అమెరికా అధ్యక్ష పీఠం ఎన్నికల్లో నల్ల జాతీయుడు బారక్ ఒబామాదే తుది విజయమని వివిధ సర్వేలు వెల్లడిస్తున్నాయి. సీఎన్ఎన్ నిర్వహించిన తాజా సర్వేలో మెజారిటీ అమెరికన్లు ఒబామాకు సంపూర్ణ మద్దుతు తెలుపుతున్నట్టు తేటతెల్లమైంది. ఈ సర్వేలో 76 శాతం ఓటర్లు ఒబామా వైపు మొగ్గు చూపగా, హిల్లరీ క్లింటన్‌కు 63 శాతం మంది ప్రజలు మద్దతు పలికారు. గత ఏడాది డిసెంబరులో జరిగిన సర్వేలో కూడా ఒబామాకు ఇలాంటి మద్దతే లభించింది. ముఖ్యంగా గత ఏడాది నిర్వహించిన సర్వేలో లభించిన మెజారిటీ కంటే ఈ దఫా అదనంగా మరో 14 శాతం మంది మద్దతు లభించడం ఇక్కడ ప్రత్యేకత.

ఈ ఇద్దరు అభ్యర్థులు ప్రతిపక్ష డెమొక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష పీఠానికి తలపడటం, పలువురు డెమొక్రటిక్ ప్రతినిధులు హిల్లరీ క్లింటన్‌ను పోటీ నుంచి తప్పుకోవాలని సూచించడం ఒబామాకు కలిచొచ్చే అంశంగా ఉంది. ఇదిలావుండగా ఇప్పటి వరకు వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఒబామా, హిల్లరీలు నువ్వానేనా అన్న రీతిలో పోటీ పడుతున్నారు. కొన్ని చోట్ల ఒబామా పైచేయి సాధించగా, మరికొన్ని చోట్ల హిల్లరీకి బ్రహ్మరథం పట్టారు.
About Writer
PNR