బర్తరఫ్‌కు గురైన న్యాయమూర్తులను పాకిస్థాన్ ప్రభుత్వం తిరిగి నియమిస్తుందని ఆ దేశ ప్రధాని యూసఫ్ రజా గిలానీ స్పష్టం చేశారు. సోమవారం రాత్రి పాకిస్థాన్ న్యూస్ పేపర్స్ సొసైటీ (ఏపీఎన్ఎస్) ప్రతినిధులతో పాక్ ప్రధాని గిలానీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు పలు అంశాలపై చర్చించారు. తొలగించిన న్యాయమూర్తులను తిరిగి నియమించడమే కాకుండా.. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయవ్యవస్థను ఏర్పాటు చేయడమే పాకిస్థాన్ ముందున్న తక్షణ కర్తవ్యమన్నారు.
గత ఏడాది నవంబరు మూడో తేదీన దేశంలో విధించిన ఎమర్జెన్సీ కారణంగా న్యాయవ్యవస్థను రద్దు చేసి, న్యాయమూర్తులను గృహనిర్భంధంలో ఉంచిన విషయం తెల్సిందే. అయితే పాకిస్థాన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక గృహ నిర్భంధంలో ఉన్న న్యాయమూర్తులను విడిపించారు. ప్రతి అంశానికి జాతీయ అసెంబ్లీయే నిర్ణయాత్మక కేంద్రం. దేశంలో నెలకొన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నట్టు చెప్పారు. దీనికి పార్లమెంటరీ కమిటీ సిఫార్సు చేస్తోందని చెప్పారు.
|