ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > అంతర్జాతీయ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
సౌదీ పర్యటనకు మంత్రి ప్రణబ్ ముఖర్జీ
సౌదీ అరేబియా పర్యటనకు విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ శనివారం బయలుదేరుతున్నారు. ప్రణబ్ ముఖర్జీ పర్యటనలో భాగంగా ద్వైపాక్షిక సంబంధాలను పటిష్టం చేసుకుంటూనే వివిధ రంగాల్లో సహకారం ఇచ్చిపుచ్చుకోవాలని భారత్ భావిస్తోంది.

మంత్రి ప్రణబ్ సౌదీ పర్యటన చాలాకాలంగా వాయిదా పడుతూ వస్తోంది. భారత నుంచి అత్యున్నత స్థాయి బృందం మంత్రి ప్రణబ్ వెంట వెళుతుంది. సౌదీ రాజు అబ్దుల్లా 2006లో భారతదేశ పర్యటనకు వచ్చారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలో భారత బృందం సౌదీ పర్యటనకు గత ఏడాది వచ్చారు.

సౌదీతో వివిధ రంగాలతో కలిసి పనిచేయాలని భారతదేశం గతంలో అనేక ఒప్పందాలను చేసుకుంది. మంత్రి ప్రణబ్ సౌదీ పర్యటనలో భాగంగా రాజు అబ్దుల్లా, యువరాజు సుల్తాన్, ఇతరులను కలుసుకుని సమావేశం అవుతారు.
మరిన్ని
రష్యా ప్రధానిగా బాధ్యతలు చేపడతా: పుతిన్
ఇరాక్‌లో బాంబు పేలుళ్లు: 70 మంది దుర్మరణం
మెజార్టీకి ఐదు సీట్ల దూరంలో మావోయిస్టులు
స్వతంత్ర న్యాయ వ్యవస్థ పాక్ లక్ష్యం: గిలానీ
భుట్టో హత్య కేసుపై పాక్ అసెంబ్లీలో తీర్మానం
భారత్-బంగ్లాదేశ్‌ల మధ్య "మైత్రి" సేవలు