ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > అంతర్జాతీయ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
విదేశీ పెట్టుబడులకు ఊతం: ప్రచండ
నేపాల్‌లో కొత్తగా ఏర్పాటు కానున్న మావోయిస్టు నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం విదేశీ పెట్టుబడులను ప్రోత్సహిస్తుందని మావోయిస్టు సుప్రిమో ప్రచండ ప్రకటించారు. అలాగే ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహిస్తామని తెలిపారు. అయితే ఎట్టిపరిస్థితుల్లోని నియంత పాలనకు అంగీకరించబోమని ప్రచండ స్పష్టం చేశారు. వాణిజ్య ప్రతినిధులతో గురువారం జరిగిన ముఖాముఖి సంభాషణల్లో ఈ వ్యాఖ్యలు చేశారు.

కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వం దేశంలోని ఆర్థిక రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలికేందుకు విదేశీ పెట్టుబడులను ప్రోత్సహిస్తామని ఆయన తెలిపారు. అంతేకాకుండా ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలోని పరిశ్రమలను జాతీయం చేయబోమని ఆయన ప్రకటించారు. అయితే ప్రైవేటు పెట్టుబడులకు అనుమతిస్తూ విదేశీ పెట్టుబడులను ప్రోత్సహిస్తామని ఆయన తెలిపారు.

అంతేకాకుండా పారిశ్రామికవేత్తలు తమ మనోధైర్యాన్ని కోల్పోరాదని, దేశంలోని పరిశ్రమలను స్వాధీనం చేసుకోబోమని ఆయన భరోసా ఇచ్చారు. అలాగే దేశంలో ఆర్థిక సౌభాగ్యం వర్థిల్లేందుకు ప్రతి ఒక్కరి సహకారం అవసరం కావాలని ఆయన కోరారు. నేపాల్‌లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మావోయిస్టులు విజయకేతనం ఎగురవేసిన విషయం తెల్సిందే. దీంతో నేపాల్‌లో సంకీర్ణ ప్రభుత్వం త్వరలో ఏర్పాటు కానుంది.
మరిన్ని
సౌదీ పర్యటనకు మంత్రి ప్రణబ్ ముఖర్జీ
రష్యా ప్రధానిగా బాధ్యతలు చేపడతా: పుతిన్
ఇరాక్‌లో బాంబు పేలుళ్లు: 70 మంది దుర్మరణం
మెజార్టీకి ఐదు సీట్ల దూరంలో మావోయిస్టులు
స్వతంత్ర న్యాయ వ్యవస్థ పాక్ లక్ష్యం: గిలానీ
భుట్టో హత్య కేసుపై పాక్ అసెంబ్లీలో తీర్మానం