రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ విదేశీ పర్యటనలో భాగంగా భారత్-మెక్సికో దేశాల మధ్య రెండు కీలక ఒప్పందాలు కుదిరాయి. పౌర విమానయానం, విద్యుత్ రంగాల్లో ఈ ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అలాగే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత పటిష్టమయ్యేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఇరుదేశాల అధిపతులు నిర్ణయించారు. ఈ ఒప్పందం కార్యక్రమంలో బ్రెజిల్ అధ్యక్షుడు ఫిలిపే కాల్డరోన్‌తో పాటు, కేంద్ర సాంప్రదాయేతర ఇంధన వనరుల శాఖామంత్రి విలాస్‌రావ్ మెట్టుంవార్, మెక్సికో దేశ విదేశీ సంబంధాల శాఖామంత్రి పట్రీసియా ఎపినోజా, విద్యుత్ శాఖ కార్యదర్శి గోర్గానా కెస్సెల్ తదితరులు పాల్గొన్నారు.
ఇందులో తొలిగా పౌర విమాన సేవల రంగంలో మరింత సహకారం అందించుకోవాలని ఇరు దేశాల నేతలు నిర్ణయించారు. ఆ తర్వాత విద్యుత్ రంగాలపై ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా మెక్సికో అధ్యక్షుడు కాల్డరోన్ మాట్లాడుతూ శాస్త్ర, సాంకేతిక, ఫుడ్ ప్రాసెస్సింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తదితర రంగాలపై జరిగిన చర్చ సంతృప్తి నిచ్చిందన్నారు.
అంతకుముందు రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ 13 రోజుల విదేశీ పర్యటనలో భాగంగా లాటిన్ అమెరికా, బ్రెజిల్, మెక్సికో తదితర దేశాల్లో పర్యటిస్తున్న విషయం తెల్సిందే. భారత్ - మెక్సికో దేశాలు వివిధ రంగాల్లో సహకారం ఇచ్చిపుచ్చుకుంటూ ముందుకుసాగాలని పిలుపునిచ్చారు. అలాగే ఇరు దేశాల ఆర్థికాభివృద్ధిలో నెలకొన్న అనిశ్చితిని అధికమించడమే మనముందు ఉన్న పెద్ద సవాల్ అని ప్రతిభా పాటిల్ అభిప్రాయపడ్డారు.
|