అమెరికా అధ్యక్ష ఎన్నికలు పూర్తయిన తర్వాత ఇరాక్ నుంచి సంకీర్ణ దళాలను వెనక్కి పిలుస్తామని అమెరికా అధ్యక్ష పీఠానికి పోటీ పడుతున్న డెమొక్రటిక్ అభ్యర్థులు హిల్లరీ క్లింటన్, బారక్ ఒబామాలు స్పష్టం చేశారు. ప్రతిపక్ష పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థి ఎంపికలో వీరిద్దరి మధ్య తీవ్ర పోటీ నెలకొన్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో గురువారం జరిగిన ఒక చర్చా వేదికలో వారిద్దరు వేర్వేరుగా పాల్గొని ప్రసంగించారు.
ఎన్నికలు ముగిసిన వెంటనే ఇరాక్ నుంచి సైన్యాన్ని ఉపసంహరించే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వారిరువురు వేర్వేరుగా పేర్కొన్నారు. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్‌ల్లో ఆల్‌ఖైదా కార్యకలాపాలను పరిగణలోకి తీసుకొని దళాల ఉపసంహరణ చేపడుతామని ఒబామా ప్రకటించారు.
అలాగే కమాండర్ల అభిప్రాయాలను, సలహాలను స్వీకరించిన తర్వాత దళాల ఉపసంహరణపై ఒక ప్రత్యేక విధానాన్ని రూపొందించి తదునుగుణంగా ముందుకుసాగుతామని హిల్లరీ క్లింటన్ తెలిపారు. అంతేకాకుండా రెండు నెలల కాలవ్యవధిలో ఉపసంహరణకు సంబంధించి ఒక నివేదికను రూపొందించాల్సిందిగా కోరనున్నట్టు ఆమె తెలిపారు.
|