ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > అంతర్జాతీయ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
రాజప్రాసాదాన్ని వీడి వెళ్లండి: మావోయిస్టులు
నేపాల్ రాజ్యాంగ ఎన్నికల్లో విజయభేరీ మోగించిన మావోయిస్టులు మెల్లగా పావులు కదుపుతున్నారు. 240 సంవత్సరాల రాజరికానికి వ్యతిరేకంగా మావోయిస్టులు తుపాకీతో పోరాటం జరిపారు. ఆ తర్వాత ఆ దేశ రాజకీయ రాజకీయ పార్టీలకు, మావోయిస్టుల మధ్య ఏర్పడిన శాంతి ఒప్పందంతో మావోయిస్టులు ఇటీవల జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు.

అత్యధిక స్థానాలు కైవసం చేసుకున్న మావోయిస్టులు మరికొన్ని పార్టీలతో కలసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజు జ్ఞానేంద్ర వీలైనంత త్వరగా రాజప్రాసాదాన్ని ఖాళీ చేయాలని మావోయిస్టు ఛైర్మన్ ప్రచండ హుకుం జారీ చేశారు. లేని పక్షంలో ప్రజలే ఖాళీ చేయిస్తారని ఆయన హెచ్చరించారు.

రాజు జ్ఞానేంద్ర స్వయంగా రాజభవనాన్ని వీడిపోతే రాజ కుటుంబీకులకు, దేశానికి, ప్రజలకు ఎంతో మేలుగా ఉంటుందని ప్రచండ పేర్కొన్నారు. ప్రచండ ఈ తాజా హెచ్చరికలతో నేపాల్ రాజు జ్ఞానేంద్ర భారత్‌లో తలదాచుకోవచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
మరిన్ని
సరబ్‌జిత్ ఉరిశిక్ష మరికొద్ది రోజులు వాయిదా
దళాల ఉపసంహరణ తథ్యం: హిల్లరీ, ఒబామా
కీలక రంగాల్లో భారత్-మెక్సికో ఒప్పందాలు
విదేశీ పెట్టుబడులకు ఊతం: ప్రచండ
సౌదీ పర్యటనకు మంత్రి ప్రణబ్ ముఖర్జీ
రష్యా ప్రధానిగా బాధ్యతలు చేపడతా: పుతిన్