బంగ్లాదేశ్‌లో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 17 మంది దుర్మరణం పాలయ్యారు. మరో యాభై మంది గాయాలపాలయ్యారు. ఆ దేశ రాజధాని ఢాకాకు 124 కిలోమీటర్ల దూరంలోని వాయువ్య బంగ్లాదేశ్, తంగైల్ జిల్లాలోని జమునా బ్రిడ్జి వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఢాకా నుంచి బయలుదేరిన ప్రయాణికుల బస్సుకు స్టీరింగ్ విరిగి పోవడంతో డ్రైవర్ బస్సును కంట్రోల్ చేయలేక పోయాడు. దీంతో జమునా బ్రిడ్జిని ఢీకొన్న బస్సు అదుపతప్పి రైల్ ట్రాక్‌పై బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే స్థానికులు, పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. బస్సు బోల్తా పడిన సమయానికి రైలు వచ్చినట్టయితే పెను ప్రమాదం జరిగివుండేది. బస్సులోని ప్రయాణికులు మరింత మంది ప్రాణాలు కోల్పోయేవారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
|