ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > అంతర్జాతీయ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
పాక్ హతాఫ్‌-VI క్షిపణి పరీక్ష విజయవంతం
సుదూర లక్ష్యాలను చేధించగల అణు సామర్ధ్యం కలిగిన హతాఫ్-VI క్షిపణిని పాకిస్థాన్ రక్షణ శాఖ శనివారం విజయవతంగా ప్రయోగించింది. ఈ విషయాన్ని ఆ దేశ రక్షణ శాఖ దృవీకరించింది. హతాఫ్-VI క్షిపణి (షహీనా-2) రెండు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను సులభంగా చేధించగలదు. ఇది అణ్వాయుధాలతో పాటు ఇతర యుద్ధ సామాగ్రిని మోసుకెళ్లగలదని మిలిటరీ శాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

విజయవతంగా ప్రయోగించిన ఈ క్షిపణిని గుర్తు తెలియని ప్రాంతం నుంచి ప్రయోగించినట్టు చెప్పారు. ఈ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించిన పాకిస్థాన్ ఇంజనీర్లకు, శాస్త్రవేత్తలకు ఆ దేశ ప్రధాని యూసఫ్ రజా గిలానీ అభినందలు తెలిపారు. ఈ ప్రయోగం ద్వారా దక్షిణాసియా ప్రాంతంలో ఆయుధాల సమీకరణకు తాము సిద్ధమంటూ పాకిస్థాన్ ప్రకటించింది. ఇటీవలి కాలంలో వివిధ రకాల క్షిపణి పరీక్షలను పాకిస్థాన్ నిర్వహిస్తూ వస్తున్న విషయం తెల్సిందే.

ఇవన్నీ భారత్‌ను లక్ష్యంగా చేసుకునే నిర్వహించడం గమనార్హం. దక్షిణాసియాలో దాయాది దేశాలైన పాకిస్థాన్-భారత్‌లు క్షిపణి పరీక్షలను గత 1998 సంవత్సరం నుంచి పోటీపడి జరుపుతున్నాయి. ఇవన్నీ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన్ని కలిగివున్నాయి. ఇదిలావుండగా... దేశ రక్షణ రంగానికి అవసరమైన పూర్తి సహాయ సహాకారాలను కొత్త ప్రభుత్వం అందిస్తుందని పాక్ ప్రధాని గిలానీ ఈ సందర్భంగా ప్రకటించారు.
మరిన్ని
ప్రభుత్వాలు కూలిపోతాయ్: ఐఎంఎఫ్
బంగ్లాదేశ్‌లో రోడ్డు ప్రమాదం: 17 మంది మృతి
సరబ్‌కు ప్రాణదానం చేయండి: భారత్
రాజప్రాసాదాన్ని వీడి వెళ్లండి: మావోయిస్టులు
సరబ్‌జిత్ ఉరిశిక్ష మరికొద్ది రోజులు వాయిదా
దళాల ఉపసంహరణ తథ్యం: హిల్లరీ, ఒబామా