అమెరికా అధ్యక్ష పీఠానికి పోటీ పడుతున్న డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించే పెన్సిల్వేనియా ప్రైమరీ ఎన్నికలు వచ్చే మంగళవారం జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో న్యూయార్క్ మేయర్, మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ భార్య హిల్లరీ క్లింటన్ వెనుకబడిన పక్షంలో ఆమెకు సరికొత్త చిక్కులు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా పోటీ నుంచి తప్పుకోమని ఆమె సొంత పార్టీకే చెందిన ప్రతినిధులు ఒత్తిడి తెచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
దీనిపై పార్టీ ఛైర్మన్ హోవర్డ్ డీన్ మాట్లాడుతూ.. పెన్సిల్వేనియా ఎన్నికల్లో మరో అభ్యర్థి ఒబమా కంటే వెనుకబడిన పక్షంలో డెమొక్రాట్ పార్టీ పెద్దలు హిల్లరీని పోటీ నుంచి తప్పుకోమని ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందన్నారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో నల్లజాతీయుడు ఒబామా హిల్లరీ కంటే ఆధిక్యంలో ఉన్న విషయం తెల్సిందే.
వీరి ఆధిపత్యం కోసం ఇరువురు అభ్యర్థులు వ్యక్తిగత దూషణలకు దిగడం పార్టీకి చెడ్డపేరు తెస్తోందని డెమొక్రటిక్ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇవి ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి విజయానికి సాయపడే అవకాశం లేకపోలేదని వారు పేర్కొంటున్నాయి.
|