ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > అంతర్జాతీయ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
లర్ఖానా ఉప ఎన్నికల్లో పోటీ చేస్తా: జర్ధారీ
మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో హత్య దరిమిలా ఎన్నికల పోలింగ్ నిలిపివేసిన లర్ఖానా నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ కో-ఛైర్మన్ అసిఫ్ ఆలీ జర్ధారీ చెప్పారు. ఒక వేళ ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే ఖచ్చితంగా ప్రధానమంత్రి పదవి చేపడుతానో లేదో తాను చెప్పలేనని ఆయన అన్నారు. అత్యవసర పరిస్థితుల్లోనే ప్రధాని పదవి చేపట్టే విషయంపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఆదివారం బిబిసి న్యూస్ ఛానెల్‌కు జర్ధారీ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దేశాధ్యక్షుడు ముషారఫ్ అభిశంసనపై జర్ధారీని ప్రశ్నించగా ఆచితూచి స్పందించారు. ముషారఫ్‌పై అభిశంసన ప్రవేశపెట్టాలంటే పార్లమెంటులో మూడింట రెండువంతుల మెజారిటీ సాధించాల్సి ఉందన్నారు. ఆ తర్వాతే ఈ అంశాన్ని పరిశీలిస్తామన్నారు.

పిపిపి అధినేత్రి బెనజీర్ భుట్టో దారుణ హత్యానంతరం ఆ పార్టీ కో-ఛైర్మన్‌గా జర్ధారీ బాధ్యతలు చేపట్టిన విషయం తెల్సిందే. ఆ తర్వాత జరిగిన పాక్ సార్వత్రిక ఎన్నికల్లో పిపిపి ఎక్కువ స్థానాలను గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరించింది. ద్వితీయ స్థానంలో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు చెందిన పీఎంఎల్ (ఎన్) పార్టీ నిలిచింది. ఈ రెండు పార్టీలు కలసి పాక్‌లో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.
మరిన్ని
22న పెన్సిల్వేనియా ప్రైమరీ ఎన్నికలు
ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తాం: మావోయిస్టు
యధాతథంగా సరబ్‌జిత్ ఉరి: పాక్
పాక్ హతాఫ్‌-VI క్షిపణి పరీక్ష విజయవంతం
ప్రభుత్వాలు కూలిపోతాయ్: ఐఎంఎఫ్
బంగ్లాదేశ్‌లో రోడ్డు ప్రమాదం: 17 మంది మృతి