ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > అంతర్జాతీయ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
అమెరికా ఎన్నికలు: హిల్లరీ జీవన్మరణ పోరాటం
అమెరికా అధ్యక్ష భవనానికి పోటీ పడుతున్న డెమొక్రాట్ల అభ్యర్థుల్లో ఒకరైన హిల్లరీ క్లింటన్ జీవన్మరణ పోరాటం సాగిస్తున్నారు. మంగళవారం జరుగనున్న పెన్సిల్వేనియా ఎన్నికల్లో ఆమె విజయం సాధించి తీరాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ఎన్నికల్లో హిల్లరీ ఓటమి పాలైతే అధ్యక్ష పదవి అభ్యర్థి పోటీ నుంచి తప్పుకునే ప్రమాదం పొంచివుంది. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో నల్లజాతీయుడు బారక్ ఒబామాకు 1644 ఓట్లు రాగా, హిల్లరీకి 1502 ఓట్లు దక్కాయి.

ముఖ్యంగా శ్వేతసౌధం అభ్యర్థి ఎంపిక కోసం డెమొక్రాట్ పార్టీ తరపున జరుగుతున్న ఎన్నికల్లో ఒబమా ఆది నుంచి పైచేయి సాధిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మంగళవారం జరిగే పెన్సిల్వేనియా ఎన్నికలు ఒబామా కంటే హిల్లరీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. దీంతో ఒబామాపై వ్యక్తిగత దూషణలకు సైతం హిల్లరీ దిగారు. ముఖ్యంగా రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి మెక్‌కెయిన్‌ను ఒబామా ప్రశంసించడాన్ని హిల్లరీ తనకు అనుకూలంగా మలుచుకున్నారు.

ఈ అంశాన్నే ప్రధానాస్త్రంగా చేసుకొని ఆయనపై మాటల దాడి చేస్తున్నారు. ఇదే విషయంపై డెమొక్రాట్లు కూడా ఆందోళన చెందుతున్నారు. ప్రత్యర్థి పార్టీ తరపున అధ్యక్ష పీఠం బరిలో ఉన్న మెక్ కెయిన్‌ను ఒబామా పొగడడం వారికి ఏమాత్రం మింగుడుపడటం లేదు.
మరిన్ని
విద్యార్హత చట్టాన్ని రద్దు చేసిన పాక్ సుప్రీం
మెజారిటీకి ఒక్క సీటు దూరంలో మావోయిస్టులు
మావోయిస్టుల పేరు తొలగింపునకు చర్యలు: యూఎస్
మళ్లీ క్షిపణి పరీక్ష నిర్వహించిన పాకిస్థాన్
సోమాలియా అల్లర్లలో 81 మంది దుర్మరణం
లర్ఖానా ఉప ఎన్నికల్లో పోటీ చేస్తా: జర్ధారీ