ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > అంతర్జాతీయ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
రాజు అధికారాల రద్దుకు నేపాల్ 'సుప్రీం' ఓకే
నేపాల్ రాజు జ్ఞానేంద్ర అధికారాలన్నింటినీ రద్దు చేస్తూ ఆ దేశ పార్లమెంట్ చేసిన డిక్లరేషన్‌కు నేపాల్ సుప్రీం కోర్టు ఆమోదముద్ర వేసింది. దీంతో 240 సంవత్సరాల రాజు పాలనకు చరమగీతం పాడినట్టయింది. గత 2006 సంవత్సరం మే 18వ తేదీన మావోయిస్టులతో సహా ఏడు పార్టీలకు ప్రధాన పార్టీల మధ్య కుదిరిన ఒప్పందం కుందిరింది. ఆ తర్వాత నేపాల్ పార్లమెంట్‌లో ఒక డిక్లరేషన్‌ను రూపొందించారు.

ఇందులో నేపాల్ రాజు అధికారాలను రద్దు చేయడం, రాజు ఆధీనంలో ఉన్న దేశ సైన్యాన్ని పార్లమెంటు పరధిలోకి తీసుకురావడం, 1990 నాటి రాజ్యాంగాన్ని రద్దు చేయడం వంటి విషయాలు ఈ ఒప్పందంలో కీలకాంశాలు. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు రూపొందించిన ఒప్పందం మేరకు పార్లమెంట్‌ చేసిన డిక్లరేషన్ చెల్లదని పేర్కొంటూ సుప్రీం కోర్టులో కొందరు న్యాయవాదులు ఒక పిటీషన్ దాఖలు చేశారు.

దీనిపై జస్టీస్ అనుప్ రాజ్ శర్మ, జస్టీస్ రాం ప్రసాద్ శ్రేష్ట, జస్టీస్ గౌరీ తకల్‌‌లతో కూడిన ధర్మాసనం పిటీషన్లపై విచారించింది. పార్లమెంటు జారీ చేసిన డిక్లరేషన్ చెల్లుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది. అంతేకాకుండా నేపాల్‌ను రిపబ్లిక్ దేశంగా ప్రకటించాలన్న పార్లమెంట్ ప్రతిపాదనకు కూడా సుప్రీం ఆమోదముద్ర వేసింది. అలాగే డిక్లరేషన్‌కు సబంధించిన దాఖలు చేసిన రెండు పిటీషన్లను సుప్రీం ధర్మాసనం కొట్టి వేసిందని స్థానిక పత్రికలు పేర్కొన్నాయి.
మరిన్ని
చైనాలో ఢీకొన్న రైళ్లు: 43 మంది దుర్మరణం
ఆఫ్గాన్ అధ్యక్షుడు కర్జాయ్‌పై హత్యాయత్నం
సరబ్‌‌కు వ్యతిరేకంగా పాక్ విద్యార్థుల ర్యాలీ
చర్చలకు నేనే హాజరవుతా: దలైలామా
ఇరాక్ తీవ్రవాదులకు ఇరాన్ సాయం: అమెరికా
భారత్-పాక్‌ల మధ్య వీసా రద్దు: షరీఫ్ ప్రతిపాదన