రష్యా కొత్త దేశాధ్యక్షుడుగా దిమిత్రి మెద్వేదవ్, ప్రధానమంత్రిగా వ్లాదిమీర్ పుతిన్‌లు ప్రమాణస్వీకారం చేశారు. ఈ చారిత్రాత్మక సంఘటన దేశ రాజధాని మాస్కోలోని క్రెమ్లిన్ భవనంలో ఆర్భాటంగా బుధవారం జరిగింది. సోవియట్ యూనియన్ పతనమైన తర్వాత మూడో దేశాధ్యక్షుడుగా మెద్వేదవ్ బాధ్యతలు చేపట్టారు. మరోవైపు పుతిన్ వరుసగా రెండుసార్లు దేశాధ్యక్ష పదవిని అలంకరించి దిగిపోవటం గమనార్హం.
రష్యా 114 ఏళ్ల చరిత్రలో అతిపిన్న వయసులో అధ్యక్ష పీఠాన్ని అలంకరించిన తొలి ప్రథమ పౌరుడు మెద్వేదవ్ కావటం విశేషం. కొత్త అధ్యక్షుడు, ప్రధానమంత్రి ప్రమాణస్వీకారోత్సాన్ని తిలకించటానికి 2,400 మంది అతిథులు వచ్చారు. మెద్వేదవ్ వయస్సు 42 కాగా, పుతిన్ వయస్సు 55 ఏళ్లు.
|