పాకిస్థాన్‌లో మరణశిక్షను ఎదుర్కొంటున్న భారత ఖైదీ సరబ్‌జీత్ సింగ్‌కు క్షమాభిక్ష ప్రసాదించే అవకాశం ఉందని ఆ దేశ ప్రధాని గిలానీ సూచన ప్రాయంగా తెలిపారు. ఇది కేవలం తన వ్యక్తిగత అభిప్రాయమని ఆయన అన్నారు.
ఆయన ఒక ప్రైవేట్ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ విషయం వెల్లడించారు. సరబ్‌జీత్ కేసును తమ దేశ విదేశీ వ్యవహారాలు, మానవ హక్కుల సంఘం, అంతర్గత, న్యాయశాఖలు పరిశీలిస్తున్నాయని తెలిపారు. ఈ శాఖలన్నీ సరబ్‌జీత్ కేసుపై సమీక్ష జరిపిన తర్వాత దోషి క్షమాభిక్షకు అర్హుడా? కాదా? అనే విషయాన్ని ఖరారు చేస్తాయని తెలిపారు. అప్పటి వరకు ఉరిశిక్షను అమలు చేయరాదని దేశ అధ్యక్షుడు ముషారఫ్‌కు లేఖ రాసినట్టు గిలానీ వెల్లడించారు.
కాగా, ఏప్రిల్ ఒకటో తేదీనే సరబ్‌జీత్‌ను ఉరితీయాల్సి వుండగా, ముషారఫ్ చొరవతో 30 రోజుల పాటు తొలుత వాయిదా వేశారు. ఆ తర్వాత పాక్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్రధాని గిలానీ వ్యక్తిగతంగా ముషారఫ్‌కు లేఖ రాశారు. దీంతో సరబ్‌జీత్ ఉరిశిక్ష అమలును నిరవధికంగా వాయిదా వేశారు.
|