ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > అంతర్జాతీయ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
అభ్యర్థిత్వ పోటీ నుంచి వైదొలగనున్న హిల్లరీ..!
అమెరికా అధ్యక్ష పీఠం కోసం పోటీ చేసే డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి ఖరారు పోటీ నుంచి న్యూయార్క్ సెనెటర్ హిల్లరీ క్లింటన్ తప్పుకోనున్నారు. అధ్యక్ష గడువు దగ్గర పడుతున్నకొద్దీ తన పార్టీ అభ్యర్థి బారక్ ఒబామాకు మద్దతు అనూహ్యంగా పెరుగుతోంది.

దీంతో పోటీ నుంచి తప్పుకోవడమే మంచిదని సొంత పార్టీకి చెందిన ప్రతినిధులు హిల్లరీకి సూచిస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఒబామా పైచేయి సాధించిన విషయం తెల్సిందే. డెమొక్రటిక్ పార్టీ తరపున అధ్యక్ష పీఠానికి పోటీ చేసే అభ్యర్థికి కనీసం 2025 ప్రతినిధుల మద్దతు తప్పనిసరి. ప్రస్తుతం ఒబామాకు 1,860.5 మంది మద్దతు లభించగా, హిల్లరీకి 1,698 మద్దతు ఉంది.

అయితే ఒబామా కూడా 2025 మంది ప్రతినిధుల మద్దతు లభించే అవకాశాలు లేవు. అయినప్పటికీ మిగిలిన ప్రైమరీల్లో ఒబామాకు మద్దతు బాగా లభిస్తోంది. కాగా, మరో 12 ప్రైమరీలకు ఎన్నికలు జరుగాల్సి ఉంది. ఈ ఎన్నికల్లో సింహభాగం ఒబామాకే పట్టం కట్టే అవకాశం ఉంది.

దీనికి తోడు అధికార పార్టీ అభ్యర్థి మెక్‌కెయిన్‌తో తలపడేందుకు సరైన అభ్యర్థి ఒబామాయేనని, అందువల్ల హిల్లరీ పార్టీ నుంచి తప్పుకోవాలని తీవ్ర ఒత్తిడి వస్తోంది. అయితే చివరి వరకు పోరాడుతానని హిల్లరీ ప్రకటించింది.
మరిన్ని
సరబ్‌జీత్‌కు పాక్ క్షమాభిక్ష పెట్టొచ్చు: గిలానీ
కాశ్మీర్‌పై మరో యుద్ధం వద్దు: పాకిస్థాన్
క్షమాభిక్షపై పరిశీలన: పాక్ ప్రధాని గిలానీ
నేపాల్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు
విస్తృత ఏకాభిప్రాయం తప్పనిసరి: కమల్‌నాథ్  
జ్యోతిర్మయి నిందితుడు కోర్టులో హాజరు