ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > అంతర్జాతీయ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
శ్రీలంక ఎన్నికల్లో అధికార పార్టీ విజయం
శ్రీలంకలోని పశ్చిమ ప్రొవియన్స్‌ కౌన్సిల్‌కు జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ విజయం సాధించింది. దేశాధ్యక్షుడు మహేంద్రా రాజపక్సే నేతృత్వంలోని అధికార పార్టీకి పశ్చిమ ప్రొవియన్స్ కౌన్సిల్ ఎన్నికల్లో 20 సీట్లు వచ్చినట్టు ఎన్నికల విభాగం వెల్లడించింది. అలాగే ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన యునైటెడ్ నేషనల్ పార్టీ 15 సీట్లను కైవసం చేసుకోగా, లెఫ్ట్ పార్టీ జేవీపి లేదా ది పీపుల్స్ లిబరేషన్ నేషనల్ ఫ్రంట్‌లు ఒక స్థానంలో గెలుపొందాయి.

మరో సీటులో తమిళ్ డెమొక్రటిక్ నేషనల్ అలయెన్స్ పార్టీ విజయం సాధించింది. పశ్చిమ ప్రొవియన్స్‌ కౌన్సిల్‌కు ఎన్నికలు గత శనివారం జరిగాయి. గత 20 సంవత్సరాల తర్వాత ఈ ప్రాంతంలో ఎన్నికలు నిర్వహించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

ఈ ఎన్నికల ఫలితాలపై దేశాధ్యక్షుడు రాజపక్సే హర్షం వ్యక్తం చేశారు. శ్రీలంక తీవ్రవాదులకు, తమకు జరుగుతున్న పోరుకు మద్దతుగా ప్రజలు ఇచ్చిన తీర్పు ఈ ఫలితాలని ఆయన విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
మరిన్ని
మావోయిస్టులపై చర్యకు నేపాలీ కాంగ్రెస్ డిమాండ్
అభ్యర్థిత్వ పోటీ నుంచి వైదొలగనున్న హిల్లరీ..!
సరబ్‌జీత్‌కు పాక్ క్షమాభిక్ష పెట్టొచ్చు: గిలానీ
కాశ్మీర్‌పై మరో యుద్ధం వద్దు: పాకిస్థాన్
క్షమాభిక్షపై పరిశీలన: పాక్ ప్రధాని గిలానీ
నేపాల్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు