అమెరికాలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఆరుగురు భారతీయలు దుర్మరణం పాలయ్యారు. విహారయాత్రకు వెళ్లిన వీరు తిరిగిరాని లోకాలకు చేరుకున్నారు. తాము ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి ప్రమాదానికి గురికావడంతో అందులోని ఏడుగురిలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.
మృతుల్లో శుభమ్ చౌదరి, నితిన్ అగర్వార్, ఈయన భార్య స్వాతి, మనోజ్ ఝురియా, భార్య మిలీ, కౌశిక్ దేవ్‌లు ఉన్నారు. కారులో ఉన్న నితిన్ గుప్తా అనే యువకుడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. వీరందరూ వివిధ సాఫ్ట్‌వేర్ కంపెనీలలో పని చేస్తున్నారు. ఈ ప్రమాద వివరాలు పోలీసుల కథనం మేరకు 13 మంది భారతీయులు రెండు మినీ వ్యాన్లలో విహారయాత్రకు బయలుదేరారు.
ఒక వ్యానులో ఏడుగురు ఉన్నారు. ఈ కారును కౌశిక్ డ్రైవింగ్ చేస్తున్నారు. మధ్యాహ్న సమయంలో పెన్సిల్వేనియా ప్రాంతంలో కారు వెళుతుండగా అదుపుతప్పి పల్టీలు కొడుతూ బోల్తా పడింది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, నితిన్ మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు వెల్లడించారు.
|