ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > అంతర్జాతీయ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
చైనాలో ప్రకృతి ప్రకోపం: మృతులు 8,500
స్వయం ప్రతిపత్తి కోసం పోరాటం సాగిస్తున్న టిబెట్ ప్రజలపై తమ బలాన్ని చూపించిన చైనా పాలకులపై ప్రకృతి ఆగ్రహించింది. భూకంపం రూపంలో ప్రకోపించిన ప్రకృతి.. ఒక్కసారి దాదాపుగా పది వేల మందిని బలితీసుకుంది.

మృతుల్లో వేలాది మంది విద్యార్థులు ఉన్నారు. నైరుతి చైనా ప్రాతంలోని సిచువాన్ ప్రాంతంలో సోమవారం సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 7.8గా నమోదైంది. భూకంపం సంభవించిన తర్వాత పెద్దగా నష్టం అంచనా తెలియలేదు. అయితే సహాయక బృందాలు రంగంలోకి దిగాక గాని జరిగిన నష్టం బయటపడలేదు.

ఈ భూకంపం ధాటికి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 8,500 మందిగా ఉందని చైనా అధికారిక పత్రిక ప్రకటించింది. మరో మూడు నుంచి ఐదు వేల మంది మృతి చెందివుంటారని భావిస్తున్నారు. అయితే.. ఈ ప్రకృతి ప్రకోపంలో భారతీయులెవ్వరూ నష్టపోలేదని చైనాలోని భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.

మృతులే అంత భారీ సంఖ్యలో ఉంటే.. ఇక ఆస్తి నష్టం ఏ మేరకు ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సిచువాన్ రాష్ట్రం పూర్తిగా నేలమట్టమైంది. ఇక్కడ ఉన్న పెద్దపెద్ద భవనాలు కూలిపోయాయి. ఈ రాష్ట్రంలో మృతులు భారీగా ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే బైచువాన్ రాష్ట్రం కూడా తీవ్రంగా దెబ్బతింది. ఇక్కడ ఐదు వేల మందికి పైగా మరణించినట్టు సమాచారం.

దుజియాంగ్ గ్యాన్ నగరంలోని ఒక పాఠశాల భవనం కూలిపోవడంతో అందులోని తొమ్మిది వందల మంది విద్యార్థులు సజీవ సమాధి అయ్యారు. భూకంపం ప్రకంపనలు చైనా రాజధాని బీజింగ్‌ను కూడా తాకాయి. భూకంప తీవ్రత ఉన్న ప్రాంతాల్లో నీటి సరఫరా, విద్యుత్, టెలిఫోన్ వంటి వ్వవస్థలు పూర్తిగా స్తంభించి పోయాయి.

ఈ ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. భూకంప బాధితులను కాపాడి, వారిని అన్ని విధాలా ఆదుకుంటామని చైనా ప్రకటించింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రశాంతత, నమ్మకం, మనోస్థైర్యాన్ని కలిగి వుండాలని చైనా ప్రధాని వెన్ జియబావో విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
మరిన్ని
చైనాలో భారీ భూకంపం: వందలాది మంది మృతి
దుబాయ్‌‌కు చేరుకున్న ప్రణబ్ ముఖర్జీ
అమెరికాలో ఆరుగురు భారతీయుల దుర్మరణం
శ్రీలంక ఎన్నికల్లో అధికార పార్టీ విజయం
మావోయిస్టులపై చర్యకు నేపాలీ కాంగ్రెస్ డిమాండ్
అభ్యర్థిత్వ పోటీ నుంచి వైదొలగనున్న హిల్లరీ..!