రష్యా నూతన ప్రధాని వ్లాదిమిర్ పుతిన్ కొత్త క్యాబినెట్‌ను ఏర్పాటు చేశారు. మాజీ ప్రధానిగా పని చేసిన జుబకోవ్‌ను తొలి ఉప ప్రధానిగా నియమించారు. ఈయనకు మల్టీ బిలియన్ డాలర్ల విలువ చేసే జాతీయ అభివృద్ధి ప్రాజెక్టును అమలు చేసే వ్యవసాయం, మత్య్సు మంత్రిత్వ శాఖలను కేటాయించారు. అలాగే మాజీ ప్రధాని ద్మిట్రీ మెద్వదేవ్ మంత్రి వర్గంలో విదేశీ వ్యవహారాల శాఖామంత్రిగా పని చేసిన సెర్జీ లవ్‌రోవ్, ఆర్థిక మంత్రి అలెక్స్ కుడ్రిన్, రక్షణ శాఖామంత్రి అంటోలీ సర్డ్యుకోవ్‌లు తిరిగి తమ మంత్రి పదవులను దక్కించుకున్నారు.
ప్రధానిగా ఉన్న మెద్వదేవ్ రష్యా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడంతో అధ్యక్షుడు వ్లాదిమిరి పుతిన్ ప్రధానిగా గత వారం బాధ్యతలు స్వీకరించిన విషయం తెల్సిందే. ఈ కొత్త క్యాబినెట్‌లో ఇద్దరు తొలి ప్రధానులు, ముగ్గురు ఉప ప్రధానులు ఉన్నారు. క్రెమ్లిన్‌కు ప్రధానాధికారిగా పని చేసిన సెర్జీ సొబ్యానిన్, ఈయనకు సహాయకుడిగా పని చేసిన ఇగోర్ సెచిన్లను ఉప ప్రధానులుగా నియమించనున్నారు.
|