ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > అంతర్జాతీయ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
సరబ్‌జీత్‌కు క్షమాభిక్షపై పాక్‌లో వ్యతిరేకత
బాంబు పేలుళ్ళ కేసులో మరణదండన ఎదుర్కోనున్న భారత ఖైదీ సరబ్‌జీత్‌ సింగ్‌కు ప్రాణదానం చేసేందుకు పాకిస్థాన్ అంతర్గత భద్రతా శాఖ వ్యతిరేకత తెలుపుతోంది. ఇలాంటి నిర్ణయాలు విద్రోహ చర్యలకు మరింత ఊతమిచ్చేవిగా ఉంటాయని పేర్కొంది.

అలాగే దేశ సిద్ధాంతాలకు వ్యతిరేకమని ఆ శాఖ ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు. దీంతో సరబ్‌జీత్‌కు ఉరిశిక్ష అమలు ఖాయమని తెలుస్తోంది. వివిధ కేసుల్లో ఖైదీలకు పడిన మరణశిక్షలను జీవిత కారాగార శిక్షలుగా మార్చాలని పాక్‌లో కొలువుదీరిని కొత్త ప్రభుత్వం ఒక ప్రతిపాదన చేసింది. ఇందులో భారత ఖైదీ సరబ్‌జీత్ మరణశిక్ష కూడా ఉంది. దీనిపై నిర్ణయం తీసుకునేందుకు మంగళవారం ఆ దేశ ఉన్నాతాధికారులు సమావేశమయ్యారు.

ఇందులో విదేశీ వ్యవహారాలు, అంతర్గత, న్యాయ, మానవహక్కుల సంఘం నేతలు పాల్గొనగా, అంతర్గత భద్రత అడిషినల్ కార్యదర్శి జఫీర్ అబ్బాసీ నేతృత్వం వహించారు. మరణశిక్షలను జీవితకాల శిక్షలుగా మార్చేందుకు అంతర్గత శాఖ ఉన్నతాధికారులు పూర్తిగా తీవ్రంగా వ్యతిరేకత తెలిపారు. ఇలాంటి చర్యలు దేశ సిద్ధాంతాలకు వ్యతిరేకమని వారు వ్యాఖ్యానించినట్టు డైలీ టైమ్స్ పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది.

ఒక వేళ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను ఆమోదిస్తే.. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని వారు అభిప్రాయపడినట్టు వెల్లడించింది. 1990 సంవత్సరం లాహోర్‌లో జరిగిన బాంబు పేలుళ్ళలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో సరబ్‌జీత్‌కు ఉరిశిక్ష పడింది. దీన్ని గత ఏప్రిల్ 30వ తేదీనే అమలు చేయాల్సి వుండగా, కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి మేరకు శిక్షను నిరవధికంగా వాయిదా వేశారు.
మరిన్ని
పెరుగుతున్న మృతులు: జోరుగా సహాయక చర్యలు
బంగ్లాదేశ్‌లో రైళ్ళ ఢీ: 9 మంది మృతి
కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసిన పుతిన్
28న నేపాల్ రాజ్యాంగ అసెంబ్లీ సమావేశం
ఉప ఎన్నికల్లో పోటీ చేయనున్న నవాజ్ షరీఫ్
డిసెంబరులో బంగ్లా ఎన్నికలు: ప్రభుత్వం