వారం రోజుల్లో రెండో సారిగా పాక్ దళాలు సరిహద్దు వద్ద కాల్పులు జరపడం ఆందోళనకరమని ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించారు. ఉత్తర కాశ్మీర్‌లోని తాంగ్‌దార్ వద్ద జరిగిన కాల్పులపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఐదేళ్ల క్రితం నాటి కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ దళాలు ఉల్లంఘించడాన్ని సైనిక కార్యకలాపాల డైరక్టర్ జనరల్ పరిశీలిస్తున్నారన్నారు.
రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఓ సైనిక కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు దీనిపై నిరసన వ్యక్తం చేసిన రక్షణ మంత్రి ఆంటొని ఇప్పటికే తమ ఆందోళనను పాక్ రక్షణ మంత్రికి తెలిపామని తెలిపారు.
|