ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రెండు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం భూటాన్‌కు బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో నూతన ప్రభుత్వం విధి విధానాలు, అంతర్జాతీయ సమస్యలు, ఉభ దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరుపుతారు. హిమాలయ దేశమైన భూటాన్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటయ్యాక పర్యటిస్తున్న తొలి ప్రధాని మన్మోహన్ కావడం గమనార్హం.
రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్యం వైపు అడుగులు వేసేందుకు భూటాన్ తీసుకున్న చర్యలకు భారత్ ఎంతగానో సహాయ సహకారాలు అందించింది. ఈ నేపథ్యంలో భూటాన్ పర్యటనకు వెళ్లిన ప్రధాని.. 17వ తేదీన భూటాన్ పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశించి కీలకోపన్యాసం చేయనున్నారు.
ఆ తర్వాత తలా జల విద్యుత్ ప్రాజెక్టును భూటాన్, భారత్ ప్రజకు అంకితమివ్వనున్నారు. అలాగే.. 1,095 మెగావాట్ల సామర్థ్యం కలిగిన జలవిద్యుత్ ప్రాజెక్టుకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. భారత ప్రధాని మన్మోహన్ సింగ్ పర్యటన ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత పటిష్టం చేస్తుదని ఆ దేశ ప్రధాని జిగ్మే వై.థిన్లే ఆశాభావం వ్యక్తం చేశారు.
|