శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 10మంది ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన స్థానిక ఫోర్ట్ ప్రాంతంలో సంబుద్ధలోక వద్ద శుక్రవారం జరిగిందని లంక రక్షణ వర్గాలు తెలిపారు. ప్రయాణీకులతో వెళుతున్న బస్సును లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దళ సభ్యుడు మోటార్‌బైక్‌పై వచ్చి ఢీకొట్టాడు.
ఆత్మాహుతి దాడిలో 86మంది గాయపడ్డారు. ఈ పేలుడుకు వేర్పాటువాద సంస్థ ఎల్టీటీఈ కారణమని లంక వర్గాలు ఆరోపించాయి. వేర్పాటువాద శక్తుల దాడిని దేశాధ్యక్షుడు మహీంద రాజపక్సే ఖండించారు.
|