పొరుగు దేశమైన భూటాన్ అభివృద్ధికి ఆర్ధిక సహాయం అందించటానికి తాము సంసిద్ధంగా ఉన్నామని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రకటించారు. ప్రధానమంత్రి హోదాలో మన్మోహన్ సింగ్ తొలిసారి భూటాన్ పర్యటనకు శుక్రవారం వెళ్లారు.
భూటాన్ ప్రజాస్వామ్య దేశంగా రూపాంతరం చెందిన తర్వాత అక్కడకు వచ్చిన తొలి విదేశీ నేత మన్మోహన్ సింగ్. భారత-భూటాన్‌ల మధ్య వాణిజ్యం పెంపొందేందుకు వీలుగా అక్కడ రైలు మార్గాల ఏర్పాటుతో పాటుగా విద్యుదుత్పత్తి సామర్ధ్యం పెంపుకు తాము కృషి చేస్తామని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి శివశంకర్ మీనన్ తెలిపారు.
|