ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > అంతర్జాతీయ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
నేపాల్‌లో మావోయిస్టు-మాధేసీల ప్రభుత్వం: భట్టారాయ్  Search similar articles
నేపాల్‌లో రాజకీయాలు కీలక మలుపు తిరిగనున్నాయి. ముగిసిన ఎన్నికల్లో విజయం సాధించిన మావోయిస్టులు ప్రభుత్వ ఏర్పాటు కోసం మద్దతు ఇచ్చేందుకు నేపాలీ కాంగ్రెస్, సీపీఎన్-యూఎంఎల్‌లు మద్దతు నిరాకరించాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు మావోయిస్టులను వ్యతిరేకిస్తూ వచ్చిన మాధేసీ పార్టీలు మావోయిస్టులకు మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి.

దీంతో మావోయిస్టులు - మాధేసీలు కలసి నేపాల్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయని సీనియర్ మవోయిస్టు నేత డాక్టర్ బాబూరామ్ భట్టారాయ్ శనివారం వెల్లడించారు. నేపాల్ రాజ్యాంగ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో మావోయిస్టులు, మాధేసీ పార్టీలు ఖచ్చితమైన విధి విధానాలతో ప్రజల ముందుకు వెళ్లాయని, అందువల్ల ఆ రెండు పార్టీలు కలసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని చెప్పారు.

ఈ రెండు పార్టీలకు అనుకూలంగా ప్రజలు తీర్పు ఇచ్చారని, అందువల్ల ఈ పార్టీల మధ్య పొత్తు ఆహ్వానించదగ్గ పరిణామమని భట్టారాయ్ అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో పరాజయం పాలైనప్పటికీ ఎన్సీ, యూఎంఎల్‌లు అధికారంలో ఉండేందుకు కుట్ర పన్నుతున్నాయని ఆయన ఆరోపించారు.

ఆ పార్టీలు ప్రజా తీర్పునకు వ్యతిరేకంగా అధికారంలో కొనసాగేందుకు చేపడుతున్న చర్యలు ఏమాత్రం ఫలించవని ఆయన అన్నారు. ఒక వేళ మావోయిస్టుల ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించని పక్షంలో ప్రజలు వీధి పోరాటాలకు దిగుతారని ఆయన ప్రకటించారు.
మరిన్ని
ఆ ప్రకటనలు వాస్తవ దూరం: బ్రిక్ మంత్రులు
భూకంప మృతులు 22 వేలు: చైనా అధికారిక వెల్లడి
భూటాన్‌కు ప్రధాని మన్మోహన్ సింగ్ వరాలు
భూటాన్‌కు ఆర్ధిక సాయం : మన్మోహన్ సింగ్
చైనా భూకంపంలో మృతులు 22 వేలు
కొలంబోలో ఆత్మాహుతి దాడి : 10మంది బలి