ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > అంతర్జాతీయ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
నేపాల్ పార్టీల మధ్య చర్చల ప్రతిష్టంభన  Search similar articles
నేపాల్‌లో 240 సంవత్సరాలపాటు సాగిన రాజరికానికి ముగింపు పలికేందుకు గాను ఐక్యమైన ప్రధాన రాజకీయ పార్టీలు, అధికార పంపిణీ విషయంలో జరుపుతున్న చర్చల విషయంలో ఏర్పడిన ప్రతిష్టంభన కొనసాగుతోంది. దీంతో నూతన ప్రభుత్వం ఏర్పాటు విషయంలో జాప్యం జరుగుతోంది.

అధికార పంపిణీ, మావోయిస్టు పార్టీ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ భవిష్యత్తు, ఆయుధాల నిర్వహణలకు సంబంధించి ఏకాభిప్రాయ సాధన కుదరని కారణంగా సిపిఎన్-మావోయిస్టు మరియు ఇతర ప్రధాన పార్టీలు -నేపాలీ కాంగ్రెస్, సిపిఎన్-యుఎమ్ఎల్ మధ్య జరగవలసిన కీలక చర్చలు నిలిచిపోయాయని నేపాలీ కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి.

నేపాల్ ప్రధాని జిపి కొయిరాలా నివాసంలో జరగవలసిన మూడు పార్టీల సమావేశం నిలిచిపోయింది. దేశాధ్యక్ష పదవికి తగిన అభ్యర్థి ఎంపికతో సహా కీలకాంశాలపై అగ్రనేతలు ఉమ్మడి అంగీకారానికి రాలేకపోవడంలో ఈ సమావేశం వాయిదా పడిందని నేపాలీ కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.

మావోయిస్టు సైనికదళాలను జాతీయ సైన్యంలో కలిపివేయడం, కంటోన్మెంట్లలో నిలువ చేసిన వారి ఆయుధాలను నిర్మూలించడం, ఏకాభిప్రాయ సాధన ద్వారా తొలివిడత అధ్యక్షుడిని ప్రతిపాదించడం వంటి అంశాలను ఈ సమావేశంలో చర్చించాల్సి ఉంది.

అయితే తమ మూడు పార్టీల మధ్య అధికార పంపిణీ సమస్య త్వరలోనే పరిష్కారమవుతుందని మావోయిస్టు నేత బాబూరామ్ భట్టారాయ్ ఆశాభావం వ్యక్తం చేశారు. తాత్కాలిక రాజ్యాంగ సవరణతో సహా కీలక అంశాలపై ఏకాభిప్రాయ సాధనకు తాము చేరువలో ఉన్నామని సిపిఎన్ మావోయిస్టు డిప్యూటీ నేత చెప్పారు.

నూతన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తమ సైనిక దళాలకు సంబంధించిన సమస్యను పరిష్కరిస్తామంటూ తమకు మావోయిస్టులు హామీ ఇచ్చారని నేపాలీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు గోపాల్మన్ శ్రేష్ట పేర్కొనడం కొసమెరుపు.
మరిన్ని
భారత్-పాక్ మధ్య రైలు రవాణా పెంపు
భారత్, సిరియాల మధ్య వాణిజ్య ఒప్పందాలు
ముషారఫ్‌ రాజ్యాంగబద్ద అధ్యక్షుడు కారు : జర్దారి
నిష్ఫలంగా ముగిసిన జర్జారీ-షరీఫ్‌ చర్చలు
నేపాల్‌లో అశాంతికి దలైలామా ఏజెంట్లే కారణం
మండలి విస్తరణకు భారత్ తిరస్కృతి