బీజింగ్‌లో జరుగనున్న ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ క్రీడా పోటీలకు ఎలాంటి ఆటంకం కలిగించొద్దని టిబెటన్ బౌద్ధగురువు దలైలామాను చైనా హెచ్చరించింది. వివిధ దేశాలు పాల్గొంటున్న ఈ క్రీడాపోటీలకు టిబెట్ నిరసన కారులు, టిబెటన్ యూత్-కాంగ్రెస్‌నేతల నుంచి ఎటువంటి విధ్వంసక చర్యలు చేపట్టరాదని చైనా డిమాండ్ చేసింది.
టిబెట్ వివాదంపై చైనా, దలైలామాతో జరిపిన విఫలమైన నేపథ్యంలో, గతవారం జరిగిన తాజా చర్చల్లో టిబెటన్ యూత్ కాంగ్రెస్ నేతలను ప్రోత్సహించరాదని, బీజింగ్ ఒలింపిక్స్‌కు ఎలాంటి అంతరాయం కలుగనీయ కూడదని డిమాండ్ చేసింది. ఈ విజ్ఞప్తులకు అంగీకరిస్తేనే తదుపరి చర్చలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తానంటూ చైనా పేర్కొంది.
కాగా, బీజింగ్ ఒలింపిక్స్‌కు ఆటంకం కలుగనీయకుండా ఉండే విధంగా, దలైలామాతో చర్చలు జరిపేందుకు చైనా తలుపులు ఎప్పటికీ ఆహ్వానిస్తూనే ఉంటాయని చైనా కేంద్ర కమ్యూనిస్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రపంచ దేశాల నుంచి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న చైనా, బీజింగ్ ఒలింపిక్స్‌ను ఎలాంటి అంతరాయాలు జరుగకుండా నిర్వహించాలని భావిస్తోంది.
మరోవైపు దలైలామాతో చర్చలు సఫలమైతేనే ఒలింపిక్స్ ప్రారంభోత్సవాల్లో పాల్గొంటానని, టిబెట్ విషయంలో ప్రపంచ దేశాల ఆందోళనను చైనా అవగతం చేసుకోవాలని, చైనాతో చర్చించాకే తన నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు సర్కోజీ వెల్లడించిన సంగతి తెలిసిందే.
|