ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > అంతర్జాతీయ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ప్రపంచం మరవలేని మహావ్యక్తి మండేలా...  Search similar articles
Raju
WD
ప్రపంచ దేశాలన్నీ ముక్తకంఠంతో దక్షిణాఫ్రికా ప్రభుత్వ జాతివివక్షా విధానాలపై ధ్వజమెత్తడంతో నెల్సన్ మండేలా సుదీర్ఘ జైలు జీవితానికి తెరపడింది. 1990 మే 11న జైలునుంచి విడుదలైన మండేలా శాంతికి సిద్ధమే గాని, సాయుధ పోరాటాన్ని కొనసాగించక తప్పదని ప్రకటించారు. 1960లలో దక్షిణాఫ్రికాలో సాయుధ పోరాటానికి దారితీసిన జాతివివక్షా పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయి కాబట్టి పోరాట బాట వీడమని మండేలా ప్రకటించారు.

అయితే తదనంతరం పరిస్థితులు నెమ్మదించాయి. 1991లో ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎంపికైన మండేలా అన్ని జాతులూ కలిసి దక్షిణాఫ్రికాలో ఎన్నికల్లో పాల్గొనేలా ప్రయత్నాలు చేపట్టారు. చరిత్రలో మొదటిసారిగా నల్లజాతివారికి ఓటుహక్కు కల్పించారు.
మండేలా.... జనం గుండె మండే...లా
  ఏది ఏమైనా....జాతి వివక్షా చరిత్రను తిరగరాసిన నెల్సన్ మండేలా... ఈ ప్రపంచం మరువలేని మహావ్యక్తి. ఒక తెలుగు కవి ఆయన ఘనతను గురించి ఒకే ఒక కవితా వ్యాక్యంలో ఇలా వర్ణించారు.. "మండేలా.... జనం గుండె మండే...లా..."      


1994 ఏప్రిల్ 24న దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరపాలని నిర్ణయించారు. అందరికీ ఓటుహక్కు ప్రాతిపదికన జరిగిన ఈ ఎన్నికల్లో ఆఫ్రికా నేషనల్ కాంగ్రెస్ 65 శాతం మెజారిటీతో ఘన విజయం సాధించింది. 1994 మే 10న దక్షిణాఫ్రికా మొదటి అధ్యక్షుడిగా నెల్సన్ మండేలా ఎన్నికై జాతి వివక్షా చరిత్రను తిరగరాశారు.

నిర్బంధంలోంచి దేశాధ్యక్ష పగ్గాలు చేపట్టే దాకా ప్రస్థానం చేసిన మండేలాకు ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు తమకు తాముగా వెతుక్కుంటూ వచ్చాయి. 1993లో ఫ్రెడెరిక్ విలియంతో కలిసి నోబెల్ శాంతి బహుమతిని మండేలా పంచుకున్నారు. ఇంగ్లండ్ రాణి ఎలిజబెత్-2 నుంచి ఆర్డర్ ఆఫ్ సెయింట్ బిరుదు అందుకున్నారు. కామన్వెల్త్ నుంచి ఆర్డర్ ఆఫ్ మెరిట్ అవార్డును అందుకున్నారు.

అలాగే నాటి అమెరికా అధ్యక్షుడు సీనియర్ జార్జి బుష్ నుంచి ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ అవార్డు లభించింది. 2001లో కెనడా ప్రభుత్వం మండేలాకు గౌరవ పౌరసత్వం అందించింది. జీవించి ఉన్న వ్యక్తికి కెనడా గౌరవ పౌరసత్వం ఇవ్వడం కెనడా చరిత్రలో ఇదే మొదటిసారి కావడం విశేషం. 2004లో స్పెయిన్ ప్రభుత్వం మండేలాను ఫ్రీడమ్ ఆఫ్ ది సిటీ పురస్కారంతో గౌరవించింది.
వీడియోను వీక్షించండి
1 | 2  >>  
మరిన్ని
కాశ్మీర్ సమస్యలపై నేడే భారత్-పాక్ చర్చలు
నెల్సన్ మండేలాకు 90వసంతాలు పూర్తి
ఐఎఇఎతో భేటీకి అమెరికా దూత పయనం
ఆప్ఘన్ సరిహద్దుల్లో భారీ భద్రత అవసరం
అణు ఒప్పందాన్ని వ్యతిరేకించం : చైనా
ఒబామా అధ్యక్షుడైతే ఇష్టమే కానీ...