ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > అంతర్జాతీయ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
జర్ధారీ భద్రతాధికారి దారుణ హత్య!  Search similar articles
పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ సహాధ్యక్షుడు, బెనజీర్ భుట్టో భర్త అసిఫ్ అలీ జర్ధారీ వ్యక్తిగత భద్రతాధికారి మంగళవారం దారుణ హత్యకు గురయ్యాడు. పాక్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో దారుణ హత్యకు గురైన సంఘటన ఇంకా ప్రజల్లో మనస్సు నుంచి చెదిరిపోక ముందే.. భద్రతాధికారి హత్య ఆ దేశంలో కలకలం సృష్టించింది.

దీనితో జర్ధారీ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఈ హత్యకు వెనుక గల కారణాలపై పాక్ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. జర్ధారీ రక్షణ వ్యవస్థను చిద్రం చేసే దిశగా ఎవరేని ఈ చర్యకు పాల్పడ్డారా? అనే కోణంలో దర్యాప్తును ముమ్మరం చేసినట్లు పాక్ అధికారిక వర్గాలు మీడియాకు వెల్లడించాయి.

పాకిస్తాన్ ప్రభుత్వ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తిన ఈ సంఘటనతో, ఆ దేశ ప్రధాని యూసఫ్ రజా గిలానీ, సంకీర్ణ పీఎంఎల్-ఎన్ కలిసి ఒక అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశాయి. ఈ సమావేశంలో లండన్‌ పర్యటనలో ఉన్న పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ హాజరు కాలేదు. ఇదిలా ఉండగా పాక్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధినేత్రి బెనజీర్ భుట్టో రావల్పిండిలో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే.
మరిన్ని
ఆగస్టు 1న చైనాలో ఫాస్టెస్ట్ రైలు సేవలు ప్రారంభం
నేపాల్ తొలి అధ్యక్షునిగా రామ్ భరణ్ యాదవ్
"అణు"వుపై ముందుకు సాగుతాం : యూఎస్
బంగ్లాదేశ్‌లో భారత ఆర్మీ చీఫ్ పర్యటన
ఆగస్టు 15వరకే పీపీపీకి టైమ్ : పీఎంఎల్-ఎన్
కాల్పుల విరమణకు ఎల్టీటీఈ పచ్చజెండా!