ఉగ్రవాదంపై పోరులో సహకరిస్తున్న పాకిస్థాన్‌కు నిధులకు బదులుగా F-16 యుద్ధ విమానాలు సరఫరా చేయాలని అమెరికా నిర్ణయించిందని వార్తలు వస్తున్నాయి. పాకిస్థాన్‌కు ఇచ్చే నిధుల్లో ఎక్కువ మొత్తం ఆధునిక యుద్ధ విమానాల రూపంలో ఇకపై ఇవ్వడం జరుగుతుంది.
అమెరికా రూపొందించిన F-16 యుద్ధ విమానాలు తీవ్రవాదంపై పోరులో కీలకపాత్ర పోషిస్తాయి. పాకిస్థాన్ వైమానిక దళాన్ని పటిష్టం చేసే పనిలో తాము చేపట్టిన యత్నాలు సఫలం అవుతాయని వైట్ హౌస్ ప్రతినిధి డానా పెరీనో చెప్పారు. F-16 విమానాల కోసం 891 మిలియన్ డాలర్లు వ్యయం అవుతుందన్నారు. 2008-09 ఆర్ధిక సంవత్సరంలో పాకిస్థాన్‌కు 226 మిలియన్ డాలర్ల మేర సహాయం చేయాలని అమెరికా అధ్యక్షుడు బుష్ తలంచారని వివరించారు.
2009-10 ఆర్ధిక సంవత్సరంలో ఇది 140 మిలియన్ డాలర్లని తెలిపారు. F-16 విమానాన్ని గతంలో పాకిస్థాన్‌కు 3మిలియన్ డాలర్లకు అమెరికా విక్రయించిందని వివరించారు. F-16 విమానాల కొనుగోలు విషయంలో పాకిస్థాన్ తనవంతుగా అధిక మొత్తంలో నిధులను వెచ్చించాల్సి ఉంటుందని పెరీనో వెల్లడించారు.
|