తెరాయ్ ప్రాంత రాజకీయ పక్షాలతో నేపాల్ ఆపద్ధర్మ ప్రభుత్వ ప్రధానమంత్రి గిరిజా ప్రసాద్ కొయిరాలా చర్చలు జరిపారు. ఈ ప్రాంతానికి చెందిన తెరాయ్ మాధేశ్ లోక్‌తాంత్రిక్ పార్టీ, సద్భావనా పార్టీ నేతలతో దేశ రాజధాని ఖాట్మండులోని ఆయన స్వగృహంలో మంతనాలు నిర్వహించారు. నేపాల్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి ముందుకువచ్చిన నేపాలీ కాంగ్రెస్, .యునైటెడ్ మార్కిస్ట్ అండ్ లెనినిస్ట్ పార్టీ, మాధేశీ జనాధికార్ ఫోరంలతో కలిసి పనిచేయాలని వీరిని కోరారు.
ప్రభుత్వం ఏర్పాటుపై మావోయిస్టులు సూచించిన షరతుల కారణంగా అది వాయిదాపడుతూ వస్తుంది. రాజకీయ ఏకాభిప్రాయ సాధనకు మావోయుస్టుల ఆలోచనలు ప్రధాన అడ్డంకిగా మారాయన్నారు. మావోయిస్టుల సంకీర్ణ ప్రభుత్వంలోకి తెరాయ్ ప్రాంత రాజకీయ పక్షాలను భాగస్వాములుగా చేయాలని కొయిరాలా ఆశిస్తున్నారు.
నేపాల్ అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహిస్తున్న 25 రాజకీయ పక్షాలు మంతనాలు గురువారం జరిపాయి. కొత్త ప్రభుత్వానికి నాయకత్వం వహించాలంటే మూడు షరతులను మావోయిస్టులు ఇతర రాజకీయ పక్షాల ముందుంచారు. ఇందులో భాగంగా నేపాలీ కాంగ్రెస్, సీపీఎన్ (యూఎంఎల్), ఎంజేఎఫ్ పార్టీల్లో చీలిక, కనీస ఉమ్మడి ప్రణాళిక కార్యక్రమం, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కనీసం రెండేళ్లపాటు అధికారంలో కొనసాగటం వంటివి మూడు షరతులు.
|