పాకిస్థాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ పదవీగండం ఏర్పడనుంది. పాలకపక్షాలు ఆయన చుట్టూ ఉచ్చుబిగిస్తున్నాయి. ఇందులో నుంచి తప్పించుకోవడానికి ఆయన కూడా వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగితేలుతున్నాడు. ఇందులోభాగంగానే చైనా పర్యటనను అర్థాంతరంగా రద్దు చేసుకున్నారు.
మొత్తంమీద గురువారం నాటికి పాకిస్థాన్ రాజకీయాలు ఒక్కసారి వేడెక్కియి. అయితే.. ఎపుడైనా.. ఏదైనా.. జరగడం పాకిస్థాన్‌లో సహజమే. ఈ అభిశంసన సయ్యాట పాలకపక్షాలా! అధ్యక్ష ముషారఫా! అన్నట్టుగా ఉంది. ప్రస్తుతం ఆ దేశంలో నెలకొన్న పరిస్థితులను వివరిస్తూ.. పలు రకాల మీడియా కథనాలు వస్తున్నాయి.
ఇందులోభాగంగా ఈనెల 11వ తేదీన ముషారఫ్‌పై అభిశంసన తీర్మానాన్ని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని అధికార పార్టీలైన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పిపిపి), పాకిస్థాన్ ముస్లిం లీగ్-ఎన్ (పీఎంఎల్-ఎన్)లు ఒక తీర్మానించినట్టు వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఈ విషయంపై సంకీర్ణ భాగస్వామ్య పార్టీలకు చెందిన నేతలు మాత్రం ఈ విషయాన్ని ధృవీకరించడం లేదు.
|