ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > అంతర్జాతీయ > ముషారఫ్‌కు ఫాతీమా భుట్టో మద్దతు!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ముషారఫ్‌కు ఫాతీమా భుట్టో మద్దతు!
అభిశంసనకు సిద్ధమవుతున్న పాకిస్తాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌కు, పాక్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో మేనకోడలు ఉన్నట్టుండి మద్దతు ప్రకటించారు. పీపీపీ కొ-ఛైర్మన్, ఆసిఫ్ అలీ జర్దారీ, పీఎంఎల్-ఎన్ అధినేత నవాజ్ షరీఫ్‌లపై తీవ్రంగా ధ్వజమెత్తింది. జాతీయ అసెంబ్లీలో స్థానం సభ్యత్వం లేని వీరిరువురు... అధికారాన్ని వినియోగించుకోవడం ఏమాత్రం సబబు కాదని "ఛార్లటెన్స్ ఆఫ్ డెమోక్రసీ" అనే కథనంలో పేర్కొన్నారు.

ఫాతీమా భుట్టో తండ్రి ముర్తాజా భుట్టో హత్యోదంతంలో పీపీపీ అధినేత జర్దారీ ప్రమేయం ఉన్నట్లు ఆమె ఆ కథనంలో ఆరోపించింది. జాతీయ అసెంబ్లీలో స్థానంలేని జర్దారీ, షరీఫ్‌లకు, ముషారఫ్‌ను పదవి నుంచి తొలగించే అధికారం లేదని ఫాతిమా భుట్టో అభిప్రాయం వ్యక్తం చేశారు.

పార్లమెంటులో ప్రవేశించేందుకు నవాజ్ షరీఫ్, ఆసీఫ్ జర్దారీలకు ఎలాంటి అర్హత లేదని ఫాతిమా భుట్టో గుర్తు చేశారు. పీపీపీ, పీఎంఎల్ పార్టీల హయాంలో ఆహార కొరత, చమురుపై సబ్సీడీల కోత, గ్యాస్ ధరల రెట్టింపు వంటి తదితర సమస్యలను పాక్ ప్రజలు అనుభవించారని, స్వాట్ జిల్లా ప్రాంతాల్లో తీవ్రవాద కదలికలు పెచ్చరిల్లాయని ఫాతిమా భుట్టో ఆ కథనంలో ఎత్తిచూపారు.
మరిన్ని
షరీఫ్‌తో మాట్లాడుతా..! : సౌదీరాజు
ముషారఫ్‌పై అభిశంసనకు సర్వం సిద్ధం
బంగ్లా మాజీ హోంత్రికి బెయిలు మంజూరు
నేపాల్ ప్రధానిగా మావోయిస్టు చీఫ్ ప్రచండ
అభిశంసనను ఎదుర్కొంటా: ముషారఫ్
35 భారత ఖైదీలకు స్వేచ్ఛా వాయువులు