ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > అంతర్జాతీయ > ముషారఫ్‌కు పాలకపక్షాల డెడ్‌లైన్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ముషారఫ్‌కు పాలకపక్షాల డెడ్‌లైన్
పాకిస్థాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌కు ఆ దేశ పాలక పక్షాలు 24 గంటల గడువు విధించాయి. ఆదివారం సాయంత్రంతో ఈ డెడ్‌లైన్ ముగియనుంది. దీంతో ముషారఫ్‌పై మరింత ఒత్తిడి పెరిగింది. 24 గంటల్లో ఆయన ఏ విషయం తేల్చుకోవాలని స్పష్టం చేసింది. ముషారఫ్‌కు రోజులు దగ్గరపడ్డాయి. ఆయన సాయంత్రం లోగా వైదొలగకపోతే అభిశంసన ప్రక్రియ ప్రారంభమవుతుందని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ నేత, పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రి షా మహమూద్‌ ఖురేషీ స్పష్టం చేశారు.

అలాగే, ముషారఫ్‌కు చట్టపరమైన హామీలు ఇచ్చే ప్రశ్నేలేదని పాకిస్థాన్ ముస్లిం లీగ్-ఎన్‌ అధికార ప్రతినిధి సిద్ధిఖి ఉల్‌ ఫరూక్‌ స్పష్టం చేశారు. ఇదిలావుండగా,.. ముషారఫ్‌ అధ్యక్ష పదవి నుంచి వైదొలిగేందుకు నిరాకరించిన పక్షంలో ఆర్మీ చీఫ్‌ సహాయం తీసుకోవడం మినహా ప్రభుత్వానికి మరో మార్గం లేదని పీపీపీ సీనియర్‌ అన్నారు.

అయితే, ముషారఫ్‌ను దించేందుకు ఆర్మీ సహాయాన్ని కోరే అవకాశం లేదని ఆ పార్టీ సహాయ కో-ఛైర్మన్ ఆసిఫ్‌ అలీ జర్ధారీ స్పష్టం చేయడం విశేషం. తప్పుకోవడం లేదా పార్లమెంటులో అభిశంసనను ఎదుర్కోవడం అనే రెండు మార్గాలే ఆయన ముందు ఉన్నాయన్నారు. అదే సమయంలో దేశాధ్యక్ష పదవి రేసులో తాను లేనని జర్ధారీ స్పష్టం చేశారు. తదుపరి అధ్యక్ష అక్ష్యర్థిని పాలక పక్షాలే ఖరారు చేస్తాయని చెప్పారు.
మరిన్ని
ముషారఫ్‌కు ఫాతీమా భుట్టో మద్దతు!
షరీఫ్‌తో మాట్లాడుతా..! : సౌదీరాజు
ముషారఫ్‌పై అభిశంసనకు సర్వం సిద్ధం  
బంగ్లా మాజీ హోంత్రికి బెయిలు మంజూరు
నేపాల్ ప్రధానిగా మావోయిస్టు చీఫ్ ప్రచండ
అభిశంసనను ఎదుర్కొంటా: ముషారఫ్