ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > అంతర్జాతీయ > అధ్యక్ష పదవికి ముషారఫ్ రాజీనామా...?!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
అధ్యక్ష పదవికి ముషారఫ్ రాజీనామా...?!
పాకిస్థాన్ అధ్యక్ష పదవికి పర్వేజ్ ముషారఫ్ రాజీనామా చేసే అంశంపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడనుంది. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం అధ్యక్ష పదవికి రాజీనామాను ప్రకటించే అవకాశం ఉందని జోరుగా ప్రచారం సాగుతోంది. సోమవారం మధ్యాహ్నం టీవీలో తాను ప్రసంగించనున్నట్లు ముషారఫ్ ఆకస్మికంగా ప్రకటించారు.

స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా 14వ తేదీన ఆయన టీవీలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. మళ్లీ ఇంతలోనే తిరిగి టీవీ ముందుకు రావడం రాజీనామా ప్రకటన కోసమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, మంగళవారం ముషారఫ్‌పై పార్లమెంటులో అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు సర్వం సిద్ధమైంది.
మరిన్ని
అధ్యక్ష బాధ్యతలు మహిళ చేపట్టవచ్చు: జర్ధారీ
సౌదీలో ఆశ్రయం పొందనున్న ముషారఫ్
ముషారఫ్‌కు పాలకపక్షాల డెడ్‌లైన్
ముషారఫ్‌కు ఫాతీమా భుట్టో మద్దతు!
షరీఫ్‌తో మాట్లాడుతా..! : సౌదీరాజు
ముషారఫ్‌పై అభిశంసనకు సర్వం సిద్ధం