ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > అంతర్జాతీయ > నేపాల్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్న ప్రచండ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
నేపాల్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్న ప్రచండ
మాజీ మావోయుస్టు నేత ప్రచండ నేత ప్రధాని పదవి చేపట్టనున్నారు. సోమవారం ఆయన పదవీ ప్రమాణ స్వీకారం చేస్ అవకాశం ఉంది. కానీ ప్రభుత్వంలో ఉండాల్సిన మంత్రివర్గసభ్యులపై సంకీర్ణంలోని పార్టీల మధ్య ఇంకా ఒక స్పష్టమైన అవగాహన కుదరలేదు. ఏ ఏ పదవులు ఎవరికి ఇవ్వాలనే అంశంపై ఏకాభిప్రాయానికి రాలేక పోతున్నారు.

ప్రమాణ స్వీకారం చేయాలని ప్రచండను నేపాల్ అధ్యక్షుడు రామ్ బరణ్ యాదవ్ ఆహ్వానించినట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. శుక్ర,శనివారాలలో ప్రధాన రాజకీయ పార్టీలైన సీపీఎన్, సీపీఎన్-యూఎంఎల్, ఎంపీఆర్ ఎఫ్ పార్టీలు సమావేశం జరిపాయి. ఈ సమావేశంలో కనీస ఉమ్మడి కార్యక్రమం రూపొందించారు. అలాగే సంకీర్ణం, కాబినెట్ విధివిధానాలపై చర్చించారు.

చివరకు ఆదివారం పార్టీల మధ్య జరిగిన సమావేశంలో కూడా మంత్రి వర్గంలో ఎవరెవరు ఉండాలనే అంశంపై వీరి మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ విషయంపై మావోయిస్టు ద్వితీయ స్థాయి నాయకుడు బాబూరాం భట్టారాయ్ మాట్లాడుతూ ప్రధాని ప్రమాస్వీకారం అయిన తరువాత మంత్రివర్గ ఏర్పాటు ఉంటుందుని చెప్పారు.

మంత్రివర్గంలో 24 మంది మంత్రులు ఉండేందుకు అన్ని పార్టీలు అంగీకరించాయి. మంత్రి వర్గంలో ఆరు స్థానాలు సీపీఎన్-యూఎంఎల్, ఎంపీఆర్ఎఫ్‌కు నాలుగు స్థానాలు, చిన్నచిన్న పార్టీలకు నాలుగు స్థానాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఉప ప్రధాని పదవి తమకు ఇవ్వాలని ఎంపీఆర్ఎఫ్‌ ప్రతిపాదనతో ఆదివారం చర్చలు విఫలమయ్యాయి.
మరిన్ని
అధ్యక్ష పదవికి ముషారఫ్ రాజీనామా...?!
అధ్యక్ష బాధ్యతలు మహిళ చేపట్టవచ్చు: జర్ధారీ
సౌదీలో ఆశ్రయం పొందనున్న ముషారఫ్
ముషారఫ్‌కు పాలకపక్షాల డెడ్‌లైన్
ముషారఫ్‌కు ఫాతీమా భుట్టో మద్దతు!
షరీఫ్‌తో మాట్లాడుతా..! : సౌదీరాజు