ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > అంతర్జాతీయ > అధ్యక్షపదవికి రాజీనామా చేస్తున్నా...!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
అధ్యక్షపదవికి రాజీనామా చేస్తున్నా...!
తాను పాకిస్థాన్ అధ్యక్ష పదవికి రాజీనామా చేయనున్నట్లు పర్వేజ్ ముషారఫ్ తెలిపారు. తనపై ప్రతిపక్షాలు వేసిన చార్జషీటు ఏమి కాదని ధీమా వ్యక్తం చేశారు. అవన్నీ నిరాధారమైనవన్నారు. తనపై ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారంతో పాకిస్థాన్‌ ప్రజలను పక్కదారి పట్టిస్తాయని చెప్పారు. ఆయన సోమవారం మధ్యాహ్నం జాతి నుద్దేశించి గంటపాటు ప్రసంగించారు.

తనపై ప్రతిపక్షాలు పెట్టిన అభిశంసన ఒత్తిడికి పాకిస్థాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ తలొగ్గారు. తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తాను అధ్యక్షపదవికి మాత్రమే రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి పక్షాలు దేశ రాజకీయాలను దిగజార్చివేసినట్లు వివరించారు. తన పదవీ కాలంలో పాకిస్థాన్ అభివృద్ధి జరిగిందన్నారు. రోడ్లు, భవనాలలో చాలా అభివృద్ధి జరిగిందన్నారు.

తన మాతృభూమి అభివృద్ధికే అహర్నిషలూ తాను కృషి చేశానన్నారు. తన ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలకు చాలా సేపు స్పష్ఠమైన సమాధానం చెప్పారు. 30 యేళ్ళలో ఎప్పుడూ లేని విధంగా సాగునీటి ప్రాజెక్టులను కట్టించామన్నారు. చట్టసభల్లో మహిళల సంఖ్య పెంచామన్నారు. ప్రస్తుతం చట్టసభలలో ఉన్న మహిళలు ఈ విషయాన్ని గుర్తించాలని కోరారు. వారు ఏ పార్టీకి చెందినవారైనా సంఖ్య పెరగడానికి తానే కారణమన్నారు.

పాకిస్థాన్ సమాచార రంగంలో ఎంత అభివృద్ధి చెందింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదని పేర్కొన్నారు. ఎట్టకేలకు ఆయన సోమవారం తన రాజీనామాను ప్రకటించారు. అప్పుడు ఆయన కాస్త భావోద్వేగానికి గురైన్టట్లు కనిపించారు. తన కంఠంలో ప్రాణం ఉండగా దేశసేవ చేస్తానన్నారు. తన ప్రసంగంలో ఎక్కడేగాని తొణుకు బెణుకు లేకుండా ప్రతి పక్షాల విమర్శలను తిప్పికొట్టారు.
మరిన్ని
నేపాల్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్న ప్రచండ
అధ్యక్ష పదవికి ముషారఫ్ రాజీనామా...?!
అధ్యక్ష బాధ్యతలు మహిళ చేపట్టవచ్చు: జర్ధారీ
సౌదీలో ఆశ్రయం పొందనున్న ముషారఫ్
ముషారఫ్‌కు పాలకపక్షాల డెడ్‌లైన్
ముషారఫ్‌కు ఫాతీమా భుట్టో మద్దతు!