ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > అంతర్జాతీయ > పాకిస్తాన్ తాత్కాలిక అధ్యక్షుడుగా సూమ్రో
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
పాకిస్తాన్ తాత్కాలిక అధ్యక్షుడుగా సూమ్రో
పాకిస్థాన్ రాజకీయాలు సోమవారం అనుకోని మలుపులు తిరిగాయి. 9 యేళ్ళుగా పాకిస్థాన్‌ను ఏకధాటిగా పరిపాలించిన ముషార్రఫ్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన పదవి నుంచి దిగిపోయిందే ఆలస్యంగా సంకీర్ణప్రభుత్వం పాకిస్థాన్ సెనేట్ ఛైర్మన్ మహమ్మద్ మియాన్ సూమ్రోను తాత్కాలిక అధ్యక్షుడుగా ప్రకటించారు.

పాక్ రాజకీయ పార్టీలు ముషార్రఫ్‌పై అభిశంసన ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో విధిలేని పరిస్థితలలో ముషార్రఫ్ తన పదవికి రాజీనామా చేశారు. అధ్యక్షపదవికి ఎన్నికలు జరిగేంతవరుకూ పాకిస్థాన్ తాత్కాలిక అధ్యక్షుడుగా సూమ్రోను నియమిస్తున్నట్లు న్యాయశాఖా మంత్రి ఫారూక్ నాయేక్ తెలిపారు.

ఇంతవరకూ పాకిస్థాన్ అధ్యక్షుడుగా ఉన్న ముషార్రఫ్ అభిశంసనను ఎదుర్కోవడానికి సిద్ధమవుతారని అందరూ అనుకున్నారు. అయితే ఆయన ప్రజల కోసమే తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో ఉత్కంఠకు తెరదిగింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా పాక్ ప్రభుత్వం తాత్కాలిక అధ్యక్షుడిని ప్రకటించింది. ముషార్రఫ్ దేశం వీడనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
మరిన్ని
అధ్యక్షపదవికి రాజీనామా చేస్తున్నా...!
నేపాల్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్న ప్రచండ
అధ్యక్ష పదవికి ముషారఫ్ రాజీనామా...?!
అధ్యక్ష బాధ్యతలు మహిళ చేపట్టవచ్చు: జర్ధారీ
సౌదీలో ఆశ్రయం పొందనున్న ముషారఫ్
ముషారఫ్‌కు పాలకపక్షాల డెడ్‌లైన్