యురేనియాన్ని రష్యా,చైనాలాంటి దేశాలకు విక్రయించడం ఏ మాత్రం మంచిది కాదని ఆస్ట్రేలియా ప్రతిపార్టీ విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి ఆండ్ర్యూ రాబ్ తెలిపారు. అదేసమయంలో యురేనియంను భారతదేశానికి విక్రయించడంవలన సద్వినియోగం అవుతుందని తెలిపారు. సోమవారం ఆయన ప్రభుత్వానికి ఈ సూచన చేశారు.
చైనా, రష్యాలాంటి దేశాలకు యూరేనియం విక్రయించడంవలను అణ్వాయుధాలు పెరుగుతాయన్నారు. వారు వారిసైనిక అవసరాలు, ఆయుధాల తయారీకి దీనిని వినియోగిస్తారని తెలిపారు. ఫలితంగా ప్రపంచానికే హాని జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అదే భారతదేశానికి ఇస్తే, వాతావరణంలోని గ్రీన్ హౌస్ వాయువుల విడుదలను తగ్గించేందుకు ఆ దేశం దానిని వినియోగిస్తుందని చెప్పారు.
ఇండియాకు ఇవ్వకుండా చైనా, రష్యాలకు యురేనియం అమ్మడం వలన ఏవిధంగా న్యాయం జరుగుతుందో చెప్పాలని నిలదీశారు.భారతదేశం యురేనియంను పూర్తిగా విద్యుచ్ఛక్తికి ప్రత్యామ్నాయంగా వినియోగిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. యురేనియం అమ్మకం వలన భారతదేశంతో ఆస్ట్రేలియాకు సంబంధాలు మెరుగుపడుతాయని అభిప్రాయపడ్డారు. ఇండియాతో సంబంధాలు మెరుగుపరుచుకోవాలని సూచించారు.
|