ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > అంతర్జాతీయ > ఇది ప్రజాస్వామ్య విజయం: పాక్ పీఎం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఇది ప్రజాస్వామ్య విజయం: పాక్ పీఎం
జనరల్ ముషార్రఫ్ తన పదవికి రాజీనామా చేయడంతో పాకిస్థాన్ పార్లమెంట్‌కు సుప్రీంగా తయారైందని ఆ దేశ ప్రధాన మంత్రి యూసూఫ్ రజా గిలానీ తెలిపారు. ముషార్రఫ్ రాజీనామా ప్రజాస్వామ్య విజయమని తెలిపారు. జాతినుద్దేశించి టీవీలో ప్రసంగించారు.

అధ్యక్షుణ్ణి ఎన్నుకోవడానికి సంకీర్ణంలోని పార్టీలు కసరత్తు చేస్తున్నాయని చెప్పారు. గత యేడు ముషార్రఫ్ తొలగించిన న్యాయమూర్తులను తిరిగి తీసుకునేందుకు సమాలోచనలు జరుగుతున్నాయన్నారు.

ముషార్రఫ్‌ను అంత సులువుగా దేశం దాటనీయరాదని న్యాయ వర్గాలు అంటున్నాయి. అధికారాలన్ని అధ్యక్షుడికి కట్టబెడుతూ ముషార్రఫ్ చేపట్టిన రాజ్యాంగంలోని 58(2బీ)ను సవరణను రద్దు చేయాలని కోరుతున్నారు. సమాచార శాఖామంత్రి షెర్రీ రెహ్మాన్ మాట్లాడుతూ ముషార్రఫ్ రాజీనామా పెద్ద విజయమన్నారు.
మరిన్ని
నేపాల్ ప్రధానిగా ప్రచండ ప్రమాణస్వీకారం
యురేయాన్ని భారత్‌కు విక్రయించడమే మంచిది
పాకిస్తాన్ తాత్కాలిక అధ్యక్షుడుగా సూమ్రో
అధ్యక్షపదవికి రాజీనామా చేస్తున్నా...!
నేపాల్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్న ప్రచండ
అధ్యక్ష పదవికి ముషారఫ్ రాజీనామా...?!