ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > అంతర్జాతీయ > పెద్ద అడ్డంకి తొలగిపోయింది: బిల్వాల్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
పెద్ద అడ్డంకి తొలగిపోయింది: బిల్వాల్
పాకిస్థాన్ ప్రజాస్వామ్యానికున్న పెద్ద అడ్డంకి తొలగిపోయింది. దేశంలో ఇక ప్రజాస్వామ్య కుసుమాలు విరాజిల్లుతాయి. ధర్మం నాలుగు పాదాల నడుస్తుందని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు బిల్వాల్ భుట్టో తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

ముషార్రఫ్ రాజీనామాపై ఆయన చాలా తీవ్రంగా స్పందించారు. పాకిస్థాన్ ప్రజాస్వామ్యానికి ముషార్రఫ్ పెద్ద అడ్డంకిలా ఉండేవాడన్నారు. ఆయన రాజీనామాతో పరిస్థితి దేశంలో చాలా సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు. దేశంలో స్వతంత్ర్యమైన న్యాయవ్యవస్థను పీపీపీ కోరుకుంటోందన్నారు.

తాను ఈ పరిస్థితిని చూసి చాలా గర్వపడుతున్నానన్నారు. కొద్ది రోజుల కిందట తన తల్లి బేనజీర్ హత్యకు ప్రజాస్వామ్య పరిణామమే సరియైన సమాధానమని వివరించారు. కాబోయే అధ్యక్షుడు పీపీపీ నుంచి ఉంటారని ఆయన చెప్పారు. సౌదీ అరేబియా నుంచి కరాచీ చేరుకున్న ఆయన ముషార్రఫ్ రాజీనామా సంఘటనపై స్పందించారు.
మరిన్ని
ఇది ప్రజాస్వామ్య విజయం: పాక్ పీఎం
నేపాల్ ప్రధానిగా ప్రచండ ప్రమాణస్వీకారం
యురేయాన్ని భారత్‌కు విక్రయించడమే మంచిది
పాకిస్తాన్ తాత్కాలిక అధ్యక్షుడుగా సూమ్రో
అధ్యక్షపదవికి రాజీనామా చేస్తున్నా...!
నేపాల్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్న ప్రచండ